Super Six : క్రికెట్లో బ్యాటర్లు చిత్రవిచిత్ర ఫీట్లు చేయడం చూస్తుంటాం. రకరకాల షాట్లు కొడితే చూసి ఎంజాయ్ చేస్తుంటాం. అయిదే… అదంతా వికెట్లకు ముందు నిలబడి చేసే ఫీట్లే. కానీ… ఓ బ్యాటర్ మాత్రం వికెట్ల వెనకాల నిలబడి బ్యాటింగ్ చేసి సిక్సర్ కొట్టడం మాత్రం ఎప్పుడూ చూసుండం. ఇండియన్ క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో ఓ బ్యాటర్ ఆ విన్యాసం చేసి… అందరూ అవాక్కయ్యేలా చేశాడు.
క్రీజులోకి అడుగుపెట్టే ప్రతి బ్యాటర్… వికెట్ల ముందు నిలబడి బౌలర్ ను ఎదుర్కొంటాడు. కొందరు బ్యాటర్లు ఫ్రంట్ ఫుట్ కి వచ్చి ఆడితే… మరికొందరు బ్యాటర్లు బౌలర్ ను కన్ఫ్యూజ్ చేసేందుకు… పిచ్ మీద అడ్డదిడ్డంగా కదులుతూ బ్యాటింగ్ చేస్తారు. వికెట్ల ముందు నిలబడే ఆడాలని క్రికెట్ లో రూలేమీ లేదు. వికెట్ల వెనకాల నిలబడి కూడా బ్యాటింగ్ చేయవచ్చు. అలా చేస్తే ఔటయ్యే ప్రమాదమో, కీపర్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడమో జరగొచ్చు. అందుకే ఆ పని ఏ బ్యాటరూ చేయడు.
కానీ… ఇండియన్ క్రికెట్ క్లబ్ మ్యాచ్ లో మాత్రం… ఓ బ్యాటర్ వికెట్ల వెనకాల నిలబడి బ్యాటింగ్ చేశాడు. బౌలర్ బంతిని చేతిలోకి తీసుకుని పరిగెత్తేందుకు సిద్ధమవుతున్న సమయంలో వికెట్ల వెనకాల నిలబడ్డ బ్యాటర్…. బౌలర్ బంతి విసిరే సమయానికి వికెట్ల ముందుకు వచ్చేసి… సిక్సర్ బాదాడు. అతను వికెట్ల వెనకాల నిలబడి బ్యాటింగ్ చేయడమే పెద్ద సాహసం అనుకుంటే… రెప్పపాటు కాలంలో వికెట్ల ముందుకొచ్చి సిక్సర్ కొట్టిన తీరు అద్భుతం. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని చూసిన క్రికెట్ అభిమానులు… వీడెవడో గానీ… ప్రపంచంలో గొప్పగొప్ప బ్యాటర్ల కంటే మొనగాడిలా ఉన్నాడే అని కామెంట్లు పెడుతున్నారు.