Big Stories

Virat Kohli : అచ్చొచ్చిన పిచ్.. కోహ్లీని అడ్డుకోగలరా?

- Advertisement -

Virat Kohli : T20 వరల్డ్ కప్ లో కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 5 మ్యాచ్ ల్లో 246 పరుగులు చేసి… టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్ పై 82, నెదర్లాండ్స్ పై 62, బంగ్లాదేశ్ పై 64 పరుగులు చేసి… మూడు మ్యాచ్ ల్లోనూ నాటౌట్ గా నిలిచాడు… కోహ్లీ. ఇదే సూపర్ ఫామ్ ను ఇంగ్లండ్ తో జరిగే సెమీస్ మ్యాచ్ లోనూ కొనసాగించాలని కోరుకుంటున్నారు… కోహ్లీ ఫ్యాన్స్.

- Advertisement -

ఇక అడిలైడ్ లోనూ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అడిలైడ్ లో మూడు ఫార్మాట్లలోనూ 14 ఇన్నింగ్స్‌ల్లో ఆడిన కోహ్లీ… 75.5 సగటుతో 907 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. ఇదే పిచ్ పై రెండు T20లు ఆడిన కోహ్లీ… 2 హాఫ్ సెంచరీలతో 154 పరుగులు చేశాడు. 2016లో జరిగిన టీ20లో 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ… ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ బంగ్లాదేశ్‌పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రికార్డ్స్ అన్నీ బయటికి తీసిన ఫ్యాన్స్… అడిలైడ్ పిచ్ పై బ్యాటింగ్ అంటే… కోహ్లీకి పూనకం వచ్చినట్టేనని అంటున్నారు. అడిలైడ్ లో కోహ్లీ దూకుడును అడ్డుకోవడం ఇంగ్లిష్ బౌలర్లకు సాధ్యం కాదంటున్నారు.

మరోవైపు… కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటంతో… ఇంగ్లండ్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు కూడా ఆందోళనలో ఉన్నారు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ కెవిన్‌ పీటర్సన్‌.. సరదాగా కోహ్లీకి ఓ రిక్వెస్ట్ చేశాడు. రేపటి మ్యాచ్‌లో ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. కోహ్లీ అంటే తనకు ఎంత ఇష్టమో అతనికి కూడా తెలుసని… రేపు ఒక్కరోజు విశ్రాంతి తీసుకో ప్లీజ్‌ అని కోహ్లీని అభ్యర్థించాడు… కెవిన్ పీటర్సన్. ఇక ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా… కోహ్లీ ఆట చూస్తుంటే భయమేస్తోందంటున్నాడు. T20 వరల్డ్ కప్ లో కోహ్లి ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్ కు ఇబ్బంది కలిగించే విషయమని… సెమీస్ లో కోహ్లిని తొందరగా ఔట్‌ చేయడమే తమ లక్ష్యమంటున్నాడు. మొత్తమ్మీద ఇంగ్లండ్ ఆటగాళ్ల భయాలు, అడిలైడ్ లో కోహ్లీ రికార్డులు చూస్తుంటే… సెమీస్ లో టీమిండియా విజయం ఖాయమంటున్నారు… అభిమానులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News