Big Stories

Sunil Gavaskar on IPL 2024 Pitches: “బౌలర్లను కాపాడండి.. క్రికెట్‌కి మేలు చేయండి”: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar on Batter Friendly Pitches in IPL 2024: టీ 20 మ్యాచ్ లు హద్దులు దాటిపోతున్నాయని, బౌలర్ల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని సీనియర్ లెజండ్ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. కొత్త కొత్త బ్యాటర్లు సైతం, సీనియర్ బౌలర్లను పట్టుకుని ఎడాపెడా సిక్సులు, ఫోర్లు కొట్టి పారేస్తున్నారు. టీ 20 మ్యాచ్ లు కాస్తే 50 ఓవర్ల వన్ డే స్కోరుని తలపిస్తున్నాయని అంటున్నారు.

- Advertisement -

సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుకి హద్దుల్లేకుండా పోయిందని అంటున్నారు. 287, 277, 266 ఇలా భారీ స్కోర్లు చేసుకుంటూ వెళుతోందని అంటున్నారు. హైదరాబాద్ మీద ఆడాలంటే బౌలర్లు వణికిపోయే పరిస్థితి వస్తోందని గవాస్కర్ అన్నాడు.

- Advertisement -

ఎందుకంటే క్రికెట్ లో బ్యాటర్లకి ఎంత విలువ ఉందో, బౌలర్లకి అంతే విలువ ఉందని అన్నాడు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నాడు. ఇలా టీ 20ల్లో ఆడి పొరపాటున పరుగులు ఎక్కువిస్తే, తర్వాత ఏ ఫ్రాంచైజీ తీసుకోదు, అంతేకాదు జాతీయజట్టులోకి దారులు శాశ్వతంగా మూసుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశాడు.

Also Read: IPL 2024 Records: ఐపీఎల్ ఒకవైపు రికార్డులు.. మరోవైపు విమర్శలు

21 ఏళ్ల కుర్రాడు టీ 20ల్లో అడుగుపెట్టి, తను ధారాళంగా పరుగులిస్తే, రేపు అతని భవిష్యత్ కి జవాబుదారి ఎవరని అడిగాడు. కొన్నిరోజులు పోతే కేవలం గొడ్డులా కొట్టేవాడికే అవకాశాలు తప్ప, టెక్నిక్ గా ఆడేవాడికి ఉండదని, అంతేకాదు ఇంక బౌలర్లకి అయితే అసలు ప్రాధాన్యత ఉండదని అన్నాడు. ఇది భవిష్యత్ క్రికెట్ కి ప్రమాదకరమని అన్నాడు.

ఫ్రాంచైజీ ల్లో కోచ్ లు కూడా పొద్దున్న లేస్తే చాలు కొట్టండి…కొట్టండి అని ఒకటే నూరిపొయ్యడంతో ఆటగాడి సహజసిద్ధమైన ఆట పోతుందని, ఆ లయ దెబ్బతిందంటే ఆ క్రీడాకారుడి కెరీర్ అయిపోయినట్టేనని తెలిపాడు. ఇలా కోచింగ్ ఇచ్చేవాళ్లని గట్టిగా తిట్టాలని ఉంది, కానీ దానివల్ల ఫలితం లేదుకదా అన్నాడు.

Also Read: అంపైర్ తో వాగ్వాదం.. డస్ట్ బిన్ పై కోపాన్ని చూపించిన విరాట్

బౌలర్లను కాపాడేందుకు చేయాల్సిన పనేమిటంటే బౌండరీ లైనుని మరో 2 మీటర్లు వెనక్కి జరపాలని అన్నాడు. దాని వల్ల బ్యాటర్లు గాల్లోకి కొట్టడాన్ని తగ్గిస్తారు. లేదంటే బౌండరీ లైను వద్ద అవుట్ అవుతారు. స్కోరు బోర్డు పరుగులు పెట్టదు. దాంతో అన్నీ నియంత్రణలోకి వస్తాయి. ఇప్పుడొక అసజమైన, కృత్రిమమైన వీధి క్రికెట్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News