E-Paper
Advertisement

రెండు రోజుల్లో మ్యాచ్ ఫినిష్ చేస్తారా ? ఇదే ఇండియాలో జ‌రిగితే దుమ్మెత్తి పోస్తారు

రెండు రోజుల్లో మ్యాచ్ ఫినిష్ చేస్తారా ? ఇదే ఇండియాలో జ‌రిగితే దుమ్మెత్తి పోస్తారు
Advertisement

Sunil Gavaskar ON AUS vs BAN :  బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య ఇటీవల టెస్ట్ సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ బంపర్ విజయాన్ని నమోదు చేసుకోగా… రెండో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా ప్రతి కారం తీర్చుకుంది. రెండు రోజులు పూర్తి కాక ముందే ఈ రెండో టెస్టు ముగించేసింది ఆస్ట్రేలియా. అయితే రెండు రోజుల్లో రెండు టెస్టు ముగిసిన నేపథ్యంలో సునీల్ గ‌వాస్కర్ (Sunil Gavaskar) చాలా సీరియస్ అయ్యారు. ఇదే ఇండియాలో రెండు రోజుల్లో మ్యాచ్ ఫినిష్ అయితే.. తమ మైదానాలను కించ ప‌రుస్తూ ఆస్ట్రేలియా, విదేశీ క్రికెట్ విశ్లేష‌కులు మాట్లాడేవారని ఆగ్రహించారు. కానీ ఇప్పుడు అదే సీన్ ఆస్ట్రేలియాలో జరిగింది కాబట్టి… వాళ్ళ మైదానాలను వెనకేసుకు వస్తున్నారని ఫైర్ అయ్యారు. అందితే జుట్టు… అందకపోతే కాళ్లు అన్నట్లుగా ఆస్ట్రేలియన్స్ వ్యవహారం ఉంద‌ని విమ‌ర్శ‌లు చేశారు.

బంగ్లాదేశ్ పై కుట్ర‌లు చేసి, ఆస్ట్రేలియా గెలిచింది

మొదటి టెస్ట్ లో ఓడిపోయిన ఆస్ట్రేలియా… రెండో టెస్టులో బంగ్లాదేశ్ ను ఓడించాలని కుట్ర చేసిందని సునీల్ గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండో టెస్ట్ జరిగిన మ్యాకే గ్రేట్ బారియర్ రీఫ్ ఎరీనా (Great Barrier Reef Arena, Mackay) పిచ్ మొత్తం బౌన్సీగా మార్చేసారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ చాప చుట్టేసిందని వివరించారు. డార్విన్ తరహాలో మైదానం ఉండి ఉంటే, ఆస్ట్రేలియా కచ్చితంగా ఓడిపోయేదని పరువు తీశారు. ఎలాగైనా సిరీస్ ను సమం చేయాలన్న కుట్రతో బౌన్సీ మైదానం తయారుచేసి బంగ్లాదేశ్ ను దెబ్బ కొట్టారని ఫైర్ అయ్యారు. చేసిందంతా చేసి పిచ్ క్యూరేటర్ ఇష్టానుసారంగా జరిగిందని.. తమకేమీ తెలియదంటూ నంగనాచి కథలు చెబుతున్నారని ఆస్ట్రేలియన్స్ పై ఫైర్ అయ్యారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

రెండు రోజుల్లో మ్యాచ్ ఫినిష్ చేస్తారా ?

ఇండియాలో రెండు రోజుల్లో టెస్టులు ఫినిష్ అయితే, మైదానాలకు రేటింగ్ ఇవ్వకుండా ఆస్ట్రేలియా కుట్రలకు తెర లేపుతోందని ఫైర్ అయ్యారు సునీల్ గ‌వాస్క‌ర్. ఇండియన్ మైదానాలు టెస్టులకు పనికిరావు అన్నట్లుగా మాట్లాడుతారని ఆగ్రహించారు. అటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా ఇండియన్ పిచ్ లను చిన్నచూపుతో చూస్తుందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మ్యాకే వేదిక‌గా జ‌రిగిన‌ మ్యాచ్ రెండు రోజుల్లో ఫినిష్ కాగా, ఆ మైదానానికి అదిరిపోయే రేటింగ్ ఐసీసీ కూడా ఇస్తుందని ఆగ్రహించారు. ఇలా ప్రతి విషయంలో ఇండియాకు అవమానమే జరుగుతుందని సునీల్ గవాస్కర్ నిప్పులు చెరిగారు. ఈ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు ఇంకెన్ని రోజులు అంటూ నిల‌దీశారు సునీల్ భాయ్‌. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. కాగా ఆసీస్‌, బంగ్లా సిరీస్ 1-1 తేడాతో స‌మం అయింది.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

బౌలర్‌గా సచిన్ కొడుకు పనికేరాడు…అన్ని మూసుకుని ఆ పని చేయాలి

ఒరేయ్ పంజాబీ అంటూ విరాట్ కోహ్లీ నన్ను అవమానించాడు

2027 వరల్డ్ కప్‌లో టీమిండియా, పాక్ మధ్య ఫైనల్స్ జరిగేలా ఐసీసీ కుట్రలు

సంజు బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారింది…ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదు

టీమిండియాలో సిక్స్ ప్యాక్ యుగం న‌డుస్తోంది.. వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం

క‌ళ్లు మూసుకుని ఆడ‌టం కాదు, అమీర్ బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడు…అభిషేక్ పై బాసిత్ ప్ర‌శంస‌లు

అందరూ ద‌ద్ద‌మ్మ‌లే.. ప‌ర్స‌న‌ల్ రికార్డుల కోస‌మే ఆడి, పాకిస్తాన్ కొంప‌ముంచుతున్నారు

టీమిండియా మ్యాచ్ లు వీడియో గేమ్ లాగా త‌యార‌య్యాయి..సిక్సుల వ‌ర్షమే

Big Stories

Advertisement
×