SRH VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఇవాళ జరగబోతోంది. ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల ( Sunrisers Hyderabad vs Kolkata Knight Riders ) మధ్య 15వ మ్యాచ్ జరగనుంది. కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన… టాస్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన…సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ ఎంచుకుంది. గతంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే అట్టర్ ప్లాప్ అయ్యింది హైదరాబాద్. అయితే ఇవాళ చేజింగ్ చేసేందుకే హైదరాబాద్ నిర్ణయం తీసుకుంది. దీంతో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్కు దిగబోతుంది.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
టైమింగ్స్, ఉచితంగా మ్యాచ్ ఎలా చూడాలి?
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల ( Sunrisers Hyderabad vs Kolkata Knight Riders ) మధ్య… జరిగే మ్యాచ్ 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ తో పాటు జియో హాట్ స్టార్ లో కూడా వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన మ్యాచ్ లు అన్ని… ఉచితంగానే జియో హాట్ స్టార్ అందిస్తోంది.
అనికేత్ వర్మ భయంకరమైన బ్యాటింగ్
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో దాదాపు అందరూ భయంకరమైన బ్యాటర్లు ఉన్నారు. హెడ్ నుంచి మొదలుపెడితే… క్లాసెన్ వరకు అందరూ హిట్టింగ్ ఆడతారు. అయితే ఈ లిస్టులోకి కొత్త కుర్రాడు అనికేత్ వర్మ కూడా చేరిపోయాడు. ఎందుకంటే… గడిచిన మూడు మ్యాచ్ లలో కూడా అనికేత్ వర్మ సిక్స్ లు, ఫోర్ లతో దుమ్ము లేపాడు. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ పైన.. కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సన్రైజర్స్ హైదరాబాద్ కు… గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇక ఇవాల్టి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తాడని అందరూ అనుకుంటున్నారు.
విఫలమవుతున్న టాప్ ఆర్డర్
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు అభిషేక్ శర్మ అలాగే హెడ్… ఇద్దరూ కాస్త క్లిక్ అయితే… 300 కొట్టడం ఈజీ. కానీ.. అభిషేక్ శర్మ ఇప్పటివరకు బ్యాట్ జులిపించలేదు. హెడ్ మాత్రం బాగానే ఆడుతున్నాడు. కానీ భారీ స్కోర్ చేయడం లేదు. అయితే ఇవాల్టి మ్యాచ్లో ఆయన ఇద్దరు అద్భుతంగా ఆడితే కచ్చితంగా హైదరాబాద్ విజయం.. సాధిస్తుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి, రమణదీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్ ( C ), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ