BigTV English

Anupriya Goenka: అనుష్క శర్మ నా ఛాన్స్ లాగేసుకుంది.. మంచు మనోజ్ హీరోయిన్ ఆరోపణలు

Anupriya Goenka: అనుష్క శర్మ నా ఛాన్స్ లాగేసుకుంది.. మంచు మనోజ్ హీరోయిన్ ఆరోపణలు

Anupriya Goenka: ఏ ఇండస్ట్రీలో అయినా ఒక హీరోయిన్‌కు వచ్చే ఛాన్స్ చేజారిపోయి మరొక హీరోయిన్ చేతికి వెళ్లడం చాలా కామన్. ముఖ్యంగా నెపో కిడ్స్ విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కష్టమే అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా అలా తనకు ఎదురైన ఒక చేదు అనుభం గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది మంచు మనోజ్ హీరోయిన్. ఒకసారి హీరోయిన్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని అనుష్క శర్మ లాగేసుకుందని, తనకు వల్లే ఒక లక్కీ ఛాన్స్ దూరమయ్యిందని బయటపెట్టింది అనుప్రియా గోయెంక.


అవకాశం పోయింది

అప్పటివరకు మోడల్‌గా తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్న అనుప్రియా గోయెంక (Anupriya Goenka).. 2013లో విడుదలయిన ‘పోటుగాడు’ మూవీతో హీరోయిన్‌గా మారింది. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదటిసారి వెండితెరపై వెలిగింది అనుప్రియా. ఆ తర్వాత తను పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. పూర్తిగా బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లు చేస్తూ అక్కడ బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఒక సినిమా కోసం దాదాపు 10 ఆడిషన్స్ ఇచ్చినా కూడా మేకర్స్ తనకు కాకుండా అనుష్క శర్మ (Anushka Sharma)కు అవకాశం ఇచ్చారంటూ బయటపెట్టింది అనుప్రియా గోయెంక.


ఎన్నో ఆడిషన్స్

‘‘నేను సుల్తాన్ (Sultan) సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాను. హీరోయిన్ పాత్ర కోసమే ఇచ్చాను. అప్పుడు వాళ్లు ఆ హీరోయిన్ పాత్ర కోసం కొత్తవాళ్లను ఎంపిక చేసుకోవాలనే చూస్తున్నారు. అలా నాకు ఆ సినిమా కోసం 11, 12 ఆడిషన్స్ జరిగాయి. మొదట ఒక ఆడిషన్, ఆ తర్వాత ఒక ఆడిషన్ ఇలా జరుగుతూనే ఉన్నాయి. మ్యూజిక్ వీడియో టెస్ట్, వైభవితో డ్యాన్స్ టెస్ట్ కూడా జరిగాయి. అలీ అబ్బాస్ జాఫర్‌తో రీడింగ్ సెషన్స్ జరిగాయి. అలా ఒక నెల రోజులు గడిచాయి. ఆ నెల రోజులు చాలా బాగుండేది. కానీ అది నెల రోజులకే పూర్తవ్వడం కూడా మంచిదే అయ్యింది’’ అంటూ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సుల్తాన్’ సినిమా ఆడిషన్స్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి గుర్తుచేసుకుంది అనుప్రియా.

Also Read: నాకు ఆ 3 రోజూ కావాల్సిందే.. అసలు విషయం బయటపెట్టిన అక్కినేని కొత్త కోడలు

హార్ట్ బ్రేక్ అయ్యింది

‘‘ఒకవేళ అదే ప్రక్రియ 6,7 నెలలు కొనసాగుంటే మనిషి ఎగ్జైట్మెంట్‌లోనే ఉండిపోయేవారు. ఎందుకంటే వైఆర్ఎఫ్‌లో నటీనటులకు పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ను ముందే ఇవ్వరు. వేరే స్క్రిప్ట్ ఇచ్చి దానిపైనే ఆడిషన్ చేస్తారు. అప్పుడే నేను అలీని కలిశాను. తను మిస్టర్ ఖాన్ అని చెప్తున్నప్పుడు నేను సుల్తాన్ కోసమే అని, అది కూడా హీరోయిన్ కోసమే ఆడిషన్ జరుగుతుందని గ్రహించాను. కానీ అంతా జరిగిన తర్వాత నాకు ఆ అవకాశం రాకపోవడంతో హార్ట్ బ్రేక్ అయ్యింది. నేను నల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు. అలా ఉండడానికి నేను చాలా గర్వపడుతున్నాను. కానీ నేను ఆ నిర్మాణ సంస్థలో హీరోయిన్ అవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు అందమైన కాళ్లు కూడా లేవు’’ అంటూ అనుష్క శర్మకు ఆ ఛాన్స్ వచ్చిందని వ్యంగ్యంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది అనుప్రియా.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×