SRH VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Sunrisers Hyderabad vs Gujarat Titans ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ( Rajiv Gandhi International Stadium, Hyderabad )… ఈ మ్యాచ్ జరగనుంది. సూపర్ సండే అయినప్పటికీ ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ జరగనుంది.
Also Read: Jofra Archer: అండర్టేకర్ లాగా నిద్ర లేచి..పంజాబ్ ను కూల్చేశాడు ?
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరిగే సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ 7 గంటలకు ఉంటుంది. ఇక… ఈ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో మనం చూడవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులన్నీ ఉచితంగానే అందిస్తున్నారు.
300 కాదు 100 అయినా కొట్టండి?
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమౌతూ వస్తోంది. ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ విజయం సాధించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లో ఓడిపోయింది. ఈ టోర్నమెంట్ లో ఈసారి 300 కొడతారని.. హైదరాబాద్ బ్యాటర్ల పై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు హైదరాబాద్ ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. దీంతో.. 300 కాదు 100 కొట్టయిన మ్యాచ్ గెలిపించండి… అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు అభిమానులు. ఇవాల్టి మ్యాచ్లో కచ్చితంగా హైదరాబాద్ గెలవాల్సి ఉంది. ఒకవేళ ఇవాళ మ్యాచ్లో కూడా ఓడిపోతే.. ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు దూరం అవుతాయి.
ఉప్పల్ మ్యాచ్ కు ప్రత్యేకంగా బస్సులు, మెట్రో సదుపాయం
రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… అర్ధరాత్రి 12 గంటలు దాటినా కూడా మెట్రో సర్వీసులు అందుబాటులోకి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ వైపు అత్యధిక బస్సులు వేస్తున్నట్లు ఆర్టీసీ కూడా ప్రకటన చేసింది.
Also Read: Pakistan: పాకిస్థాన్ టీంలో ముసలం.. ఫ్యాన్స్, క్రికెటర్స్ దారుణంగా కొట్టుకున్నారు ?
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 1 ట్రావిస్ హెడ్, 2 అభిషేక్ శర్మ, 3 ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), 4 నితీష్ రెడ్డి, 5 కమిందు మెండిస్, 6 హెన్రిచ్ క్లాసెన్, 7 అనికేత్ వర్మ, 8 పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), 9 హర్షల్ పటేల్, 10 జయదేవ్ ఉనద్కట్/సిమర్జీత్ సింగ్, 11 మహమ్మద్ షమీ, 12 జీషాన్ అన్సారీ
గుజరాత్ టైటాన్స్ : 1 సాయి సుదర్శన్, 2 శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), 3 జోస్ బట్లర్ (వికె), 4 షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, 5 షారుక్ ఖాన్, 6 రాహుల్ తెవాటియా, 7 గ్లెన్ ఫిలిప్స్/అర్షద్ ఖాన్, 8 రషీద్ ఖాన్, 9 సాయి కృష్ణ, ప్రరాజ్ 10, ప్రరాజ్ 11 ఇషాంత్ శర్మ