Samsung Galaxy S26 FE: సాధారణంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు కెమెరా బాగుండాలి, బ్యాటరీ ఎక్కువసేపు రావాలి, డిస్‌ప్లే స్మూత్‌గా ఉండాలి అని చాలామంది కోరుకుంటారు. ఈ మూడు విషయాలతో పాటు ప్రీమియం లుక్ కూడా ఉంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఫీచర్లతో శాంసంగ్ కొత్తగా Galaxy S26 FEని తీసుకొచ్చింది. రూ.79,999 ధరతో వస్తున్న ఈ ఫోన్ పిస్తాషియో, బ్లూబెర్రీ, గ్రాఫైట్ కలర్లలో అందుబాటులో ఉంది.
గెలాక్సీ S26 FE చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ వచ్చేలా డిజైన్ చేశారు. కేవలం 7.4 మిమీ మందం, 193 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఇందులో 6.7 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో బయట ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
Also Read: 7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో Exynos 2500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Android 17 ఆధారిత One UI 9తో పనిచేసే Samsung Galaxy S26 FE ఫోన్.. 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో మంచి పనితీరు అందించేలా దీన్ని రూపొందించారు. అంతేకాదు.. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ కూడా ఉంది.
ఫొటోలు, వీడియోలు తీసేవారికి కెమెరా సెటప్ ఆకట్టుకునేలా ఉంది. వెనుక 50MP మెయిన్ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. Gemini Omni సపోర్ట్‌తో గ్యాలరీలోని ఫొటోలు, వీడియోలను ఉపయోగించి కొత్త కంటెంట్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. 4900mAh బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఎక్స్ఛేంజ్‌పై రూ.8,000 వరకు బోనస్‌తో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI ఆఫర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ప్రీమియం ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది ఓ ఆసక్తికరమైన ఆప్షన్.
Also Read: రూ.9,000 డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ A56 5G.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు!