BigTV English

Surya.. Kohli : సూర్యే నెం.1, కోహ్లి బ్యాక్ స్టెప్

Surya.. Kohli : సూర్యే నెం.1, కోహ్లి బ్యాక్ స్టెప్

Surya.. Kohli : T20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను అధిగమించే మొనగాడు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ICC తాజాగా ప్రకటించిన T20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న సూర్యను కొట్టాలంటే… ఒకటి, అతను తర్వాతి మ్యాచ్‌ల్లో పేలవంగా అయినా ఆడాలి… లేదా రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఇతర బ్యాటర్లు భీకరమైన ఫామ్ లోకి అయినా రావాలి. రెండూ ఇప్పటికిప్పుడు జరిగే సూచనలు లేకపోవడంతో… T20 ర్యాంకింగ్స్‌లో కొన్నాళ్ల పాటు సూర్యదే టాప్ ప్లేస్ అని అంటున్నారు… ఫ్యాన్స్.


కివీస్‌తో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో 111 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సూర్య.. ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన T20 సిరీస్‌ ద్వారా వచ్చిన 31 పాయింట్లతో కలిపి… మొత్తం 890 పాయింట్లతో T20ల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు… సూర్య. రెండో స్థానంలో ఉన్న పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ కన్నా సూర్య ఏకంగా 54 పాయింట్ల ఆధిక్యంలో ఉండటంతో… ఇప్పట్లో అతని స్థానాన్ని కబ్జా చేసే బ్యాటర్ ఎవరూ లేరంటున్నారు… ఫ్యాన్స్.

ఇక తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి ర్యాంక్‌ మరింత దిగజారింది. T20 వరల్డ్‌కప్‌లో 4 హాఫ్‌ సెంచరీలు చేసిన కోహ్లీ ర్యాంక్‌ పడిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గత వారం 11వ స్థానంలో ఉన్న కోహ్లీ… తాజా ర్యాంకింగ్స్‌లో రెండు ర్యాంకులు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయాడు. కివీస్‌లో జరిగిన సిరీస్‌లో పాల్గొనకపోవడం కూడా కోహ్లీ ర్యాంక్‌ పడిపోవడానికి ఓ కారణం. టీమిండియా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ రెండు స్థానాలు కోల్పోయి 19వ ప్లేస్‌లో, రోహిత్‌ శర్మ 3 స్థానాలు దిగజారి 21వ స్థానంలో ఉన్నారు. ఇక బౌలర్లలో టీమిండియా నుంచి టాప్-10లో ఎవరూ లేరు. ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం హార్దిక్ పాండ్యా 3వ స్థానంలో ఉన్నాడు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×