BigTV English

Argentina: గెలిస్తేనే నిలిచే స్థితిలో అర్జెంటీనా

Argentina: గెలిస్తేనే నిలిచే స్థితిలో అర్జెంటీనా

Argentina : ఫిఫా వరల్డ్‌కప్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన అర్జెంటీనా… టోర్నీలో నిలవాలంటే ఇకపై ఆడే మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌‍కప్‌ కావడంతో… ఆ జట్టు ఈసారి ఎలాగైనా వరల్డ్‌కప్‌ గెలవాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. కానీ… సమీకరణాలు మాత్రం మరోలా ఉన్నాయి.


టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా 1-2 తేడాతో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడంతో… అంచనాలన్నీ ఒక్కసారిగా తారుమారైపోయాయి. వరల్డ్‌కప్‌ చరిత్రలో ఓ జట్టు తొలి మ్యాచ్‌లో ఓడి విశ్వవిజేతగా నిలిచిన సందర్భం ఒక్కటే ఉంది. 2010 ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన స్పెయిన్.. ఆ తర్వాత ఫుంజుకొని అద్భుత ఆటతీరుతో విశ్వవిజేతగా అవతరించింది. ఇప్పుడు గ్రూప్-సి నుంచి అర్జెంటీనా కనీసం నెక్ట్స్ రౌండ్‌కు చేరాలన్నా… చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

అర్జెంటీనా అదృష్టం కొద్దీ గ్రూప్‌-సిలో పోలాండ్‌, మెక్సికో మధ్య జరిగిన మ్యాచ్‌ గోల్స్ లేకుండానే డ్రాగా ముగిసింది. దీంతో ఆ జట్లు ఒక్కో పాయింట్ పంచుకున్నాయి. ప్రస్తుతం గ్రూప్‌-సిలో మూడు పాయింట్లతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉండగా… ఆ తర్వాత మెక్సికో, పోలాండ్ ఉన్నాయి. అర్జెంటీనా పాయింట్లు లేకుండా చివరిస్థానంలో ఉంది. ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడకుండా అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌ చేరాలంటే… తర్వాతి మ్యాచ్‌ల్లో మెక్సికో, పోలండ్‌లపై కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇక సౌదీ అరేబియాను మెక్సికో, పోలండ్‌ జట్లు ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ రెండు టీమ్స్‌ నాలుగు పాయింట్లతో ఉంటే.. అర్జెంటీనా ఆరు పాయింట్లతో గ్రూప్-సిలో టాప్‌లో నిలిచి నెక్ట్స్ రౌండ్ చేరుతుంది.


ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఒక్కటి ఓడినా ప్రీక్వార్టర్స్‌ అవకాశాలు కష్టమవుతాయి. ఒకవేళ అర్జెంటీనా ఒక మ్యాచ్‌ గెలిచి, మరో మ్యాచ్ డ్రా చేసుకుంటే… నాలుగు పాయింట్లతో ప్రీక్వార్టర్స్‌ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ అది పూర్తిగా మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. దాంతో… సమీకరణాలన్నీ అనుకూలంగా మారి అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చేరాలని ఆ జట్టు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×