E-Paper
Advertisement

Suryakumar Yadav: ఫ్లైట్ బుక్ చేసుకుని రెడీగా ఉన్నాం..ప‌ట్ట‌ప‌గ‌లే పాకిస్తాన్ కు చుక్క‌లు చూపిస్తాం

Suryakumar Yadav: ఫ్లైట్ బుక్ చేసుకుని రెడీగా ఉన్నాం..ప‌ట్ట‌ప‌గ‌లే పాకిస్తాన్ కు చుక్క‌లు చూపిస్తాం

Suryakumar Yadav:  టి20 ప్రపంచ కప్ 20026 టోర్నమెంట్ ( T20 World Cup 20026 Tournament) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ లు పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహ‌బాజ్‌ షరీఫ్ ( Pakistan PM Shehbaz Sharif ) కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ జట్టుకు అండగా నిలిచేందుకుగాను ఇండియాతో మ్యాచ్ ఆడడం లేదని సంచలన ప్రకటన చేశారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. అయితే ఈ ప్రకటన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav) స్వయంగా స్పందించారు. శ్రీలంక వెళ్లేందుకు మేము ఎప్పుడో సిద్ధంగా ఉన్నాం.. టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం… కొలంబోకు వెళ్లి పాకిస్తాన్ ను ఓడించడమే లేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సూర్య కుమార్ యాదవ్. కానీ తమతో మ్యాచ్ ఆడాలంటే వణికి పోతున్నారని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్… పాకిస్తాన్ పరువు తీశాడు.

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

మేం సిద్ధంగా ఉన్నాం.. పాకిస్తాన్ మ్యాచ్ పై సూర్య ప్రకటన

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026) భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన లీగ్ దశలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan Match) మ్యాచ్ షెడ్యూల్ అయి ఉంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇండియాతో తాము ఆడబోమని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటన చేసింది. దీంతో కోట్లల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ఈ అంశంపై తాజాగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( SURYAKUMAR YADAV ON IND PAK BOYCOTT
) స్పందించారు. ఇండియాతో మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించడంపై షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఈ విషయంలో టీమిండియా సన్నద్ధతలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ ను ఓడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కుండబద్దలు కొట్టి చెప్పారు.

పాకిస్తాన్ తో మేము ఎప్పుడు కూడా మ్యాచ్ ఆడబోమని, బహిష్కరిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు… భయపడి పోయి పాకిస్తాన్ వెనక్కి వెళ్ళిపోయిందని అంటూ పరువు తీశారు సూర్య కుమార్ యాదవ్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే కెనడా జట్లతో మ్యాచ్ లు ఆడబోతున్నాం… ఆ తర్వాత మేము శ్రీలంక లోని కొలంబోకు వెళ్తామని ప్రకటించారు సూర్య. ఈ మేరకు ఫ్లైట్ బుక్ చేసుకున్నామని… ఇక పాకిస్తాన్ ను ఓడించడమే ఆలస్యం అంటూ సూర్య కుమార్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ టి20 ప్రపంచ కప్ ఆడే కెప్టెన్సీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే సూర్య కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×