BigTV English

Suryakumar Yadav: టీ 20 కెప్టెన్‌గా సూర్య కుమార్‌కే ఛాన్స్..!

Suryakumar Yadav: టీ 20 కెప్టెన్‌గా సూర్య కుమార్‌కే ఛాన్స్..!

Suryakumar Yadav Likely to be appointed new T20I captain of India: టీమ్ ఇండియాకి టీ 20 కెప్టెన్సీపై పెద్ద చిక్కుముడి పడింది. ప్రస్తుతం శ్రీలంక సిరీస్ కి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేసినా, టీ 20కి కూడా తననే కెప్టెన్ గా ఉంచడం సరైంది కాదనే ఆలోచనలో ఉన్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు చెబుతున్నారు. ఎందుకలాగంటే.. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతుంటాడు. తనపై ఇన్ని బాధ్యతలు పెట్టడం కరెక్టు కాదని అనుకుంటున్నట్టు తెలిపాడు.


అయితే, టీ 20 ప్రపంచకప్ సాధించడంలో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా అదరగొట్టాడు. లీగ్ దశ నుంచి కూడా జట్టు క్లిష్టపరిస్థితుల్లో తను అద్భుతంగా ఆడటమే కాదు, ఆఖరిలో వచ్చి బ్రహ్మాండమైన సిక్సర్లు కొట్టి, జట్టు గెలవడానికి అవసరమయ్యే కీలకమైన పరుగులు చేసేవాడు. దాదాపు ప్రతీ మ్యాచ్ లో తన మార్క్ చూపించాడు. ఇక ఫైనల్ మ్యాచ్, ఫైనల్ ఓవర్ లో అయితే, చెప్పనే అక్కర్లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత్ కి ప్రపంచకప్ తీసుకొచ్చాడు.

అయితే తన ఆటతీరుపై ఎటువంటి సందేహాలు లేవు కానీ, బాధ్యతలు ఎక్కువగా పెట్టడం వల్ల ఫిట్ నెస్ సమస్యలు వస్తే, జట్టుకి సమస్య అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ కెప్టెన్ గా భావిస్తున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్ లో తనే కెప్టెన్ గా ఉన్నాడు. అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్ లో సహచరులతో స్నేహపూర్వకంగా ఉంటాడనే ఫీడ్ బ్యాక్ ఉందని బీసీసీఐ అధికారి తెలిపారు. అందుకనే టీ 20 వరకు సూర్య కి కెప్టెన్సీ ఇచ్చే యోచనలో ఉన్నారు.


Also Read: ప్రాక్టీసులో మహమ్మద్ షమి, బంగ్లాదేశ్ సిరీస్ కోసం..

అయితే కొత్తగా హెడ్ కోచ్ గా వచ్చిన గౌతం గంభీర్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. మరి తన మనసులో ఎవరున్నారో తెలీదు. నిజానికి శ్రేయాస్ అయ్యర్ ఉండి ఉంటే, తన ఓటు తనకే వేసేవాడు. కానీ శ్రేయాస్ చేసిన చిన్నతప్పిదానికి నేడు భారీ మూల్యం చెల్లిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ లో కోల్ కతా టీమ్ కి వీరిద్దరూ కలిసి, ఒక అండర్ స్టాండింగ్ తో ఎలా గెలిపించారో, అలాగే టీమ్ ఇండియాలో పనిచేసేవారని అంటున్నారు.

Related News

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Big Stories

×