Big Stories

Terrorist Threat To T20 World Cup: టీ 20 ప్రపంచకప్ నకు.. ఉగ్రవాద ముప్పు?

“There’s Terrorist Threat To T20 World Cup 2024: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ నకు సర్వత్రా సన్నద్ధం అవుతుంటే బాంబులాంటి వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. వెస్టండీస్ దేశానికి నషీర్ పాకిస్థాన్ అనే ఉగ్రవాద ఐఎస్ఐఎస్ మీడియా గ్రూప్.. ప్రకటన భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఐసీసీ ట్రోఫీ జరిగే చోట దాడులు చేస్తామని ఆ ఉగ్రవాద సంస్థ పిలుపునిచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దేశానికి చెందిన ప్రతినిధులు మాత్రం భద్రతా చర్యలను పటిష్టం చేస్తామని చెబుతున్నారు

- Advertisement -

అయితే జూన్ 1 నుంచి 29 వరకు టీ 20 ప్రపంచకప్ ను అమెరికా- వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే అమెరికాలో మ్యాచ్ లకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎటొచ్చి వెస్టిండీస్ లోనే సమస్య అధికంగా ఉంది.  ప్రో-ఇస్లామిక్ స్టేట్స్ నుండి ఆటలకు ముప్పు ఏర్పడిందని అనుమానిస్తున్నారు. ఉత్తర పాకిస్తాన్ నుంచి ఈ సంకేతాలు అందినట్టు గుర్తించారు.

- Advertisement -

ప్రపంచకప్ నిర్వహణకు ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడెలా? అని ఐసీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకైనా మంచిదని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది.
వెస్టిండీస్ లోని ఆంటిగ్వా , బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ , గ్రెనడైన్స్, ట్రినిడాడ్, టొబాగోలో ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Also Read: ముంబై పరువు నిలబెట్టుకుంటుందా? నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్ 

అమెరికాలోని ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్‌లలో కూడా మ్యాచ్‌లు ఉన్నాయి. అయినప్పటికీ యునైటెడ్ స్టేట్స్‌లో ఆటలకు ఎటువంటి ముప్పు లేదు. రెండు సెమీఫైనల్స్ ట్రినిడాడ్ గయానాలో జరుగుతాయి, ఫైనల్ షెడ్యూల్ బార్బడోస్‌లో జరుగుతుంది.

వెస్టిండీస్ లోని అన్ని నగరాల్లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయలతో స్టేడియంలకు మరమ్మతులు, ఆటగాళ్లకు విడిది ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, భోజన సదుపాయాలు అన్నీ చకచకా జరుగుతున్నాయి. మొత్తం వెస్టిండీస్ దేశమంతా రంగురంగుల డెకరేషన్లతో రెడీ అయిపోతోంది. అందరూ ఐసీసీ పొట్టి ప్రపంచకప్ పైనే ధ్యాస పెట్టి పనిచేస్తున్నాయి. ఈ సమయంలో ఈ ప్రకటన రావడంతో ట్రినిడాడ్ ప్రధాన మంత్రి కీత్ రౌలీ మాట్లాడారు. భద్రతా పరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉగ్రవాద ప్రకటనలపై నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సంగతి అక్కడ మీడియా సంస్థ తెలిపింది.

ఈ సమయంలో మరో సమస్య తలెత్తింది. ఎందుకంటే 2025లో పాకిస్తాన్ లో ప్రారంభం కానున్న ఛాంపియన్ ట్రోఫీకి, ఉగ్రవాద ముప్పు కారణంగా భారత్ జట్టు వెళ్లడం లేదు.  దాంతో భారత్ తో జరిగే మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాద ముప్పు ఉందని తెలిసినా భారత్ మరి వెస్టిండీస్ వెళుతుందా? వెళితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన దేశాలు ఎలా స్పందిస్తాయో, చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  ఐసీసీ కూడా ఇంకా స్పందించాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News