Tanveer Ahmed: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మొన్న ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో బాబర్ ఆజం ( Babar Azam) సేన ఛాంపియన్ గా నిలిచింది. ఆదివారం రోజున బాబర్ ఆజం కెప్టెన్ గా వ్యవహరించిన పెషావర్ జల్మీ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Peshawar Zalmi vs Hyderabad Kings Men) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బాబర్ ఆజం సేన విక్టరీ అందుకుంది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా రెండోసారి టైటిల్ అందుకుంది పెషావర్ జల్మీ. ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన బాబర్ ఆజంను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. బాబర్ ఆజం గురించి మరింత ఎక్కువ డబ్బా కొడుతున్నారు.
ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) గెలిచిన బాబర్ ఆజం పైన మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన కెప్టెన్ బాబర్ ఆజం అంటూ వ్యాఖ్యానించారు. బాబర్ ఆజం ముందు విరాట్ కోహ్లీ దేనికి పనికి రాడు.. వాడు గల్లీ క్రికెటర్ అంటూ పరువు తీశారు. స్వార్థం కోసం పరుగులు చేస్తాడు తప్ప.. బెంగళూరును కానీ అటు టీమిండియాను కానీ విరాట్ కోహ్లీ గెలిపించిన దాఖలాలు లేవని ఇజ్జత్ తీశారు తన్వీర్ అహ్మద్. అదే సమయంలో బాబర్ మాత్రం పాకిస్తాన్ కోసం చాలా కష్టపడ్డాడని కొనియాడారు.
గతంలో పాకిస్తాన్ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాడు. లేటెస్ట్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ను కూడా బాబర్ ఆజం గెలిచినట్లుగా గుర్తు చేశారు. ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కంటే బాబర్ ఆజం కెప్టెన్సీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ ( Virat kohli) అభిమానులు కౌంటర్లు పేల్చుతున్నారు.
విరాట్ కోహ్లీ వర్సెస్ బాబర్ ఆజామ్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే చర్చ ఇప్పుడు మొదలైంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించిన PSL ట్రోఫీ ని బాబర్ గెలిచిన నేపథ్యంలో ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఇక దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బాబర్ గొప్పోడు అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రచ్చ చేస్తుంటే.. ఇండియన్స్ మాత్రం విరాట్ కోహ్లీ ఇన్ని పొగుడుతున్నారు. అయితే వాస్తవం ఏంటంటే టీ20 లలో విరాట్ కోహ్లీ యావరేజ్ చాలా తక్కువ. స్ట్రైక్ రేట్ కూడా బాబర్ కంటే తక్కువ. కానీ వన్డేలు, టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీని కొట్టిన మొనగాడు లేడు. టి20 లో మాత్రం బాబర్ అద్భుతంగా రాణిస్తున్నాడని అంటున్నారు. ఇలా ఎవరి ఫార్మాట్ లో వాళ్లు గొప్పోళ్ళు అని కొంతమంది చెబుతున్నారు.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !