E-Paper
Advertisement

వర్షాలు లేకపోయినా జలపాతాల్లో నీరు ఎలా? కర్రెగుట్టల్లో వింత ప్రకృతి అద్భుతం!

వర్షాలు లేకపోయినా జలపాతాల్లో నీరు ఎలా? కర్రెగుట్టల్లో వింత ప్రకృతి అద్భుతం!
Advertisement

Karregutta Waterfalls: వేసవి వచ్చిందంటే చాలు.. ఎండల తీవ్రతకు వాగులు, వంకలు, చెరువులు ఎండిపోతుంటాయి. కానీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. బయట భానుడు నిప్పులు చెరుగుతున్నా.. అక్కడి జలపాతాలు మాత్రం నిరంతరాయంగా నీటిని పారిస్తూనే ఉంటాయి. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య నుంచి జాలువారే ఈ జలధారలు కొనసాగుతూనే ఉంటాయి. అసలు వేసవిలోనూ ఈ జలపాతాల్లో నీరు ఎలా ప్రవహిస్తుంది? దీని వెనుక ఉన్న ప్రకృతి రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

ఎక్కడున్నాయి ఈ కర్రెగుట్టలు?

తెలంగాణలోని ములుగు జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో కర్రెగుట్టల కొండలు విస్తరించి ఉన్నాయి. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న ఈ గుట్టల్లో బోలెడు చిన్న, పెద్ద జలపాతాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల పర్యాటకులను ఆకర్షిస్తున్న నంబి జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వేసవిలోనూ నీరు ఎలా వస్తుంది?

Advertisement

సాధారణంగా వేసవిలో జలపాతాల్లో నీటి ప్రవాహం తగ్గిపోతుంది. కానీ, కర్రెగుట్టల్లో అలా జరగకపోవడానికి అక్కడి భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం. ఈ ప్రాంతమంతా ఎత్తైన చెట్లు, దట్టమైన వృక్షసంపదతో నిండి ఉంటుంది. దీంతో నేలపై నేరుగా సూర్యరశ్మి పడటం తగ్గుతుంది. వాతావరణంలో తేమ నిలిచి ఉండటంతో నీరు త్వరగా ఆవిరైపోకుండా ఉంటుంది. వర్షాకాలంలో కొండల్లోకి ఇంకిన నీరు రాతి పొరల్లో నిల్వ ఉంటుంది. ఈ నీరు సహజసిద్ధమైన భూగర్భ మార్గాల ద్వారా బయటకు వచ్చి ఏడాది పొడవునా చిన్న సెలయేళ్లు, జలపాతాల రూపంలో ప్రవహిస్తుంది. వేసవిలోనూ నీటి ప్రవాహం కొనసాగడానికి ఇదొక ముఖ్యమైన కారణం. ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఉండటం వల్ల వర్షపు నీరు ఒకచోట నిల్వ ఉండకుండా సహజ మార్గాల్లో ప్రవహిస్తుంది. ఈ భౌగోళిక నిర్మాణం జలపాతాలకు నీటి సరఫరా కొనసాగడానికి  కారణం అవుతుంది.

నంబి జలపాతం ప్రత్యేకత ఏంటి?

కర్రెగుట్టల్లోని అందమైన జలపాతాల్లో నంబి జలపాతం ఒకటి. దాదాపు 700 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. దీని నీటి శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ ప్రాంతంలో నంబి జలపాతంతో పాటు మరో చిన్నా, పెద్ద జలపాతాలు ఉన్నాయి.

ప్రకృతి సంపదకు నిలయంగా కర్రెగుట్టలు

Advertisement

జలపాతాలే కాకుండా కర్రెగుట్టలు అరుదైన వృక్ష, ఖనిజ సంపదకు కూడా నిలయంగా ఉన్నాయి. గతంలో మావోయిస్టుల ప్రభావం కారణంగా ఈ ప్రాంతంలో మనుషుల సంచారం పరిమితంగా ఉండేది. దీంతో అడవుల్లోని సహజ వాతావరణం చాలావరకు కొనసాగింది. దట్టమైన అడవులు, భూగర్భ జల ఊటలు, ప్రత్యేకమైన కొండల నిర్మాణం కలిసి కర్రెగుట్టల జలపాతాలకు జీవం పోస్తున్నాయి. అందుకే మండుటెండల్లోనూ ఇక్కడి జలధారలు ప్రకృతి అందాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి.

Read Also: ఏపీలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్.. ప్రకృతి అందాలు చూస్తే మైమరచిపోతారు!

Tags

Related News

ఈ పాస్‌పోర్ట్‌కు సూపర్ క్రేజ్.. బెంగళూరులో రాత్రి 2 గంటల నుంచి బారులు తీరిన యువత

ఏపీలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్.. ప్రకృతి అందాలు చూస్తే మైమరచిపోతారు!

రన్‌వే పైకి దూసుకొచ్చిన శునకం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం, కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులో ఘటన

లోకల్ ట్రైన్‌లో ఘోరం.. యువతిని వేధించి కిందికి తోసేసిన కీచకుడు.. చేయి కోల్పోయిన బాధితురాలు!

సంక్రాంతికి ఊరెళ్లాలా? రైలు టికెట్ల బుకింగ్.. ఎప్పటి నుంచంటే?

పరిశుభ్రతలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఏకంగా ఏడు నగరాలకు అత్యుత్తమ పురస్కారాలు

వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?

Big Stories

Advertisement
×