Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో కీలక ప్లేయర్లను పాకిస్తాన్ పంపించకుండా క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా B టీంను మాత్రమే పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. కీలక ప్లేయర్ లందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫినిష్ అయిన తర్వాత పాకిస్తాన్ వెళ్తారు. అయితే పాకిస్తాన్ కు ఆస్ట్రేలియా కు సంబంధించిన B జట్టును పంపించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షాహిద్ అఫ్రిది నుంచి మొదలుకొని తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వరకు ఫైర్ అవుతున్నారు.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా B జట్టును మాత్రమే పాకిస్తాన్ పంపిస్తున్నారు. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చాలా సీరియస్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ క్రికెట్ నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మోచేతి నీళ్లు క్రికెట్ ఆస్ట్రేలియా తాగుతోందని సీరియస్ అయ్యారు. కేవలం దేశవాలి క్రికెట్ అయినా ఐపీఎల్ కోసం అంతర్జాతీయ సిరీస్ ను క్రికెట్ ఆస్ట్రేలియా లైట్ తీసుకుంటోందని నిప్పులు చెరిగాడు తన్వీర్ అహ్మద్. ఆస్ట్రేలియాకు సంబంధించిన టాప్ క్రికెటర్లను ఐపీఎల్ కోసం వదిలేసి.. పాకిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ కోసం బచ్చా క్రికెటర్లను ఎలా పంపిస్తారని ఫైర్ అయ్యారు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ప్రకారం వన్డే సిరీస్ జరిగితే పాకిస్తాన్ ( Pakistan) పరువు గంగలో కలుస్తుందని సంచలన కామెంట్లు చేశారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఐసీసీకి లేఖ రాస్తామని హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును వెంటనే బ్యాన్ చేయాలని కూడా కోరారు. దీనిపై కచ్చితంగా పోరాటం కొనసాగుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్.
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ ఈ నెల చివరలో ప్రారంభం కానుంది. మే 30వ తేదీన ఈ టోర్నమెంట్ షోరూం అవుతుంది. 25వ తేదీన ఇస్లామాబాద్ కు ఆస్ట్రేలియా క్రికెటర్లు ( Australia cricketers) చేరుకోబోతున్నారు. 30వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరుగుతుంది. జూన్ రెండవ తేదీన రెండవ వన్డే, నాలుగో తేదీన మూడవ వన్డే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది.