Tanveer Ahmed: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026) తుది దశకు వచ్చేసింది. మరో నాలుగు రోజులు గడిస్తే సెమీ ఫైనల్స్ జట్లు ఏవి అనేవి కూడా తేలిపోతుంది. అయితే ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగింటిలో పాకిస్తాన్ మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో ఆ జట్టులో ప్లేయర్ల మధ్య గొడవలు తెరపైకి వస్తున్నాయి. అలియ రియాజ్ (Aliya Riaz) వర్సెస్ కెప్టెన్ ఫాతిమా సనాకు (Fatima Sana) అస్సలు పడడం లేదట. అలియ రియాజ్, ఆమె భర్త అలీ యూనిస్ తో ఒకే రూమ్ లో కలిసి ఉంటున్నారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇప్పటికే ఫాతిమా సనా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వివాదం రాజుకుంది. అయితే, ఈ అంశంపై పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. రొమాన్స్, షికార్లు చేయడానికి మిమ్మల్ని ఇంగ్లండ్ పంపలేదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. క్రికెట్ పై శ్రద్ద పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
డ్రెస్సింగ్ రూమ్ లో కాకుండా అలియ రియాజ్ తన భర్త అలీతో కలిసి స్పెషల్ రూమ్ లో ఉంటున్నారని ఫాతిమా సనా గొడవకు దిగారు. దీనిపై పాకిస్తాన్ మహిళల జట్టు కోచ్ రియాజ్ , పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది ఫాతిమా సనా. అయితే ఈ ఫిర్యాదు నేపథ్యంలో పాకిస్తాన్ సోషల్ మీడియా, అక్కడి మీడియా సంస్థలు… అలియ ఫ్యామిలీపై దారుణంగా కథనాలు ప్రచూరించాయి. అయితే వాటికి అలియ భర్త అలీ యూనిస్ ఓ వీడియో పెట్టి మరీ… కౌంటర్ ఇచ్చారు. తన భార్య అలియ అద్భుతంగా ఆడుతోందని, తమపై తప్పుడు ప్రచారాలు ఆపాలని ఫైర్ అయ్యారు. ఇంత పెద్ద వివాదం జరిగిన నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ రంగంలోకి దిగారు.
అలియ రియాజ్ ఫ్యామిలీ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి పేరు ప్రస్తావించకుండా మండిపడ్డారు. ప్రపంచ కప్ ఆడమని పంపిస్తే… ఇంగ్లాండులో రొమాన్స్, షికార్లు చేస్తున్నారా ? అని మండిపడ్డారు. ఒకే రూమ్ లో పడుకోవడానికి ఇది మీ ఇల్లు కాదని ఆగ్రహించారు. క్రికెటర్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్లలో మాత్రమే ఉండాలని.. స్పెషల్ రూమ్స్ లో పర్మిషన్స్ ఉండబోవని గుర్తు చేశారు. ఒకసారి విఫలమైతే ఆటగాడిపై అనేక విమర్శలు వస్తాయని వెల్లడించారు. అలా వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని… ప్రదర్శన ద్వారా సమాధానం ఇవ్వాలని వెల్లడించారు. అంతేకానీ మీడియా ముందుకు వచ్చి.. ప్లేయర్ల భర్తలు ఎడాపెడా వాగితే అస్సలు కుదరదని వార్నింగ్ ఇచ్చారు. ఇకపైన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మ్యాచ్ ఆడాలని ఆలియా రియాజ్ కు కౌంటర్ ఇచ్చారు.