E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

షూటింగ్‌లో కొరియోగ్రాఫర్‌ను కొట్టిన అలియా భట్.. అసలేమైందంటే?

షూటింగ్‌లో కొరియోగ్రాఫర్‌ను కొట్టిన అలియా భట్.. అసలేమైందంటే?
Advertisement

Alpha Movie: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యాక్షన్ అంటే కేవలం హీరోల సొంతం. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్, నాలుగు పాటలు, కొన్ని సెంటిమెంట్ సీన్లకే పరిమితం.కానీ ట్రెండ్  మారింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడానికి, థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడానికి ముద్దుగుమ్మలు కూడా చేతుల్లో గన్స్ పట్టి, గాల్లో పల్టీలు  కొట్టేస్తున్నారు

స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ‘ఆల్ఫా’

సరిగ్గా ఇలాంటి ఒక హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌తో మన ముందుకు రాబోతున్నారు బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్. వీరిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆల్ఫా’. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోయే జులై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అలియా భట్ పంచుకున్న ఒక క్రేజీ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

కొరియోగ్రాఫర్‌ ని కొట్టిన ఆలియా 

Advertisement

షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. తెరపై యాక్షన్ సీన్లు పండించడం కోసం రోజులు, నెలల తరబడి కఠినమైన ప్రాక్టీస్ చేశారట. ఈ క్రమంలో ఒకరోజు రిహార్సల్స్ చేస్తుండగా, పొరపాటున పక్కనే ఉన్న యాక్షన్ కొరియోగ్రాఫర్‌కు అలియా నుంచి గట్టిగా ఒక పంచ్ పడిపోయింది. ఊహించని ఈ ఘటనతో షాకైన అలియా వెంటనే సారీ చెప్పారట. తన వల్ల ఒక వ్యక్తికి దెబ్బ తగిలిందనే బాధ ఇప్పటికీ తనని వెంటాడుతుందని ఆమె ఎమోషనల్ అయ్యారు. అయితే, ఈ సంఘటన ద్వారా ఒకటి మాత్రం స్పష్టమైంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ఎంత సహజంగా, రియలిస్టిక్‌గా డిజైన్ చేశారో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు.

Also read :విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చుట్టూ వివాదాలు.. లీగల్ యాక్షన్‌కు రెడీ అయిన రౌడీ టీమ్!

బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిన స్పై మూవీస్ 

Advertisement

‘ఆల్ఫా’ సినిమా తన కెరీర్‌లోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, మునుపెన్నడూ చూడని సరికొత్త వైల్డ్ అవతార్‌లో తాను కనిపిస్తానని అలియా ధీమా వ్యక్తం చేశారు.ఈ YRF స్పై యూనివర్స్‌కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’ (2012), ‘టైగర్ జిందా హై’ (2017), హృతిక్ రోషన్ ‘వార్’ (2019), షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ (2023), ఆపై వచ్చిన ‘టైగర్ 3’ చిత్రాలు బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేశాయో అందరికీ తెలిసిందే.

ఎలా ఉండబోతుందో చూడాలి మరి

ఇప్పుడు అదే లైనప్‌లో వస్తున్న మొదటి ఫిమేల్ సెంట్రిక్ స్పై ఫిల్మ్ కావడంతో ‘ఆల్ఫా’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు ఈ సినిమాలో  ఒక పవర్‌ఫుల్ పాత్రలోనో లార్జర్ ద్యాన్ లైఫ్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తున్నారు. ‘యానిమల్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాబీ డియోల్ , అలియాతో యాక్షన్ సీన్స్ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంత సన్నగా ఉండే అలియా పక్కన ఫైట్స్ చేయాలంటే తనకు చాలా భయం వేసిందని, ఎక్కడ తన వల్ల ఆమెకు దెబ్బలు తగులుతాయోనని ప్రతి షాట్‌ను ఎంతో జాగ్రత్తగా చేశానని చెప్పుకొచ్చారు. కానీ సెట్స్‌లో అలియా ఎనర్జీ చూసి షాకయ్యానని, యాక్షన్ సీన్లలో ఆమె అదరగొట్టేసిందని బాబీ ప్రశంసల వర్షం కురిపించారు. నిర్మాత ఆదిత్య చోప్రా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. సో, జులై 3న థియేటర్లలో లేడీ స్పైల వేట ఎలా ఉండబోతుందో చూడాలి మరి !

Related News

ఆ టెక్నాలజీతో హాలీవుడ్ రేంజ్ విజువల్స్.. ‘వారణాసి’ సీక్రెట్స్ లీక్ చేసిన జక్కన్న!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చుట్టూ వివాదాలు.. లీగల్ యాక్షన్‌కు రెడీ అయిన రౌడీ టీమ్!

డిమాంటి కాలనీ 3 వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..?

రూ.5500 కాస్ట్లీ ఫ్రేమ్.. స్టార్ డైరెక్టర్లతో నవీన్ పోలిశెట్టి కామెడీ..!

గోవాలో ఖుష్బూ కూతురి పెళ్లి.. ఒకే వేదికపై మెరిసిన టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్‌కి దొరికిన మరో విజయ్ దేవరకొండ.. ఆకాశానికి ఎత్తేసిన ఆర్జీవి

పాపం హరీష్ శంకర్ …అసలు లెక్క చేయని నవీన్ పోలిశెట్టి!

Big Stories

×