E-Paper
Advertisement

పాకిస్తాన్ ఓడిపోయేలా కుట్ర‌లు..పిచ్ లు మార్చారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

పాకిస్తాన్ ఓడిపోయేలా కుట్ర‌లు..పిచ్ లు మార్చారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు
Advertisement

Tanveer Ahmed On WI Beat Pak: పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (West Indies vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ Pakistan tour of West Indies, 2026 ) జరుగుతోంది. మొన్న 25వ తేదీన ఈ రెండు జట్ల మధ్య బ్రియాన్ లారా స్టేడియం ( Brian Lara Stadium, Tarouba, Trinidad) వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్, 90 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అదరగొట్టిన వెస్టిండీస్… పాకిస్తాన్ క్రికెటర్లకు చుక్కలు చూపించింది. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) కూడా ఈ అంశంపై స్పందించారు. వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయేలా పిచ్ తయారు చేశారని ఆగ్రహించారు. పాకిస్తాన్ వికెట్లు త్వరగా పడిపోయేలా కుట్రలకు తెరలేపినట్లు బాంబు పేల్చారు. అందుకే వెస్టిండీస్ అవలీలగా మ్యాచ్ గెలిచిందని బాంబు పేల్చాడు తన్వీర్ అహ్మద్.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

ఆబ‌ర్ ఆజం ఒంటరి పోరాటం వృథా

Advertisement

వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం ఒంటరి పోరాటం చేసినా పాకిస్తాన్ ఓడిపోయిందని తన్వీర్ అహ్మద్ ఎమోషనల్ అయ్యారు. కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు రాగానే.. బాబర్ ఆజం జట్టును సరిగ్గా లీడ్ చేశాడని వెల్లడించారు. అయితే మిగిలిన ప్లేయర్లు సహకరించకపోవడంతో పాకిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. దానికి తోడు వెస్టిండీస్ జట్టుకు అనుకూలంగా మైదానం తయారు చేశారని కూడా బాంబు పేల్చారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వికెట్లు త్వరగా పడ్డాయని వివరించారు. మొదటి ఇన్నింగ్స్ తో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ మార్చినట్లు ఆరోపణలు చేశారు. అదే వెస్టిండీస్ బ్యాటింగ్ చేసినప్పుడు మరో మైదానాన్ని సిద్ధం చేసి కుట్రకు తెరలేపినట్లు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఐసీసీ రంగంలోకి దిగి, విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

90 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం

బ్రియన్ లారా స్టేడియం వేదికగా వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 311 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ 282 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 181 పరుగులకు కుప్పకూలింది వెస్టిండీస్. చివరి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 120 పరుగులు చేసి.. ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాన్ మసూద్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సెంచరీ నమోదు చేసుకున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో విఫలమయ్యాడు. అటు పాకిస్తాన్ కొత్త కెప్టెన్ బాబర్ ఆజం మొదటి ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్స్ లో 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Advertisement

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

 

 

 

Related News

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

Big Stories

Advertisement
×