E-Paper
Advertisement

డుకాటి లవర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త మాన్‌స్టర్ లాంచ్‌కు గ్రీన్ సిగ్నల్!

డుకాటి లవర్స్ కు గుడ్ న్యూస్.. కొత్త మాన్‌స్టర్ లాంచ్‌కు గ్రీన్ సిగ్నల్!
Advertisement

2026 Ducati Monster Patented in India: ప్రీమియం సూపర్‌ బైక్ తయారీ సంస్థ డుకాటి తన కొత్త 2026 మాన్‌ స్టర్ బైక్ కు  భారత్ లో డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది. ఈ బైక్‌ ను గత ఏడాది అక్టోబర్‌ లో అంతర్జాతీయ మార్కెట్లో పరిచయం చేసిన కంపెనీ, త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పేటెంట్ పొందడంతో   ఈ బైక్ లాంచ్‌కు సంబంధించిన ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలుస్తోంది.

డిజైన్ పరంగా కీలక మార్పులు

కొత్త మాన్‌ స్టర్‌ లో డిజైన్ పరంగా భారీగామార్పులు చేశారు. ముఖ్యంగా పాత మాన్‌ స్టర్ బైక్‌ లలో కనిపించిన మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్‌ ను మళ్లీ తీసుకొచ్చారు. గత మోడల్‌ లో ఈ డిజైన్ లేకపోవడంతో అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో కొత్త వెర్షన్‌ లో క్లాసిక్ స్టైల్‌ను తిరిగి తీసుకొచ్చి బైక్‌కు మరింత లుక్ తీసుకొచ్చారు. కొత్త ఫ్యూయల్ ట్యాంక్‌ మీద ప్రత్యేక వెంట్స్‌ ను కూడా అందించారు. ఇవి పాత మాన్‌స్టర్ మోడళ్లను గుర్తు చేస్తాయి. అలాగే ముందు భాగంలో రౌండ్ ఆకారంలో ఉన్న LED హెడ్‌ లైట్‌ తో పాటు సరికొత్త డే టైమ్ రన్నింగ్ లైట్స్  ఇచ్చారు. ముందు, వెనుక భాగాల్లో డైనమిక్ టర్న్ ఇండికేటర్లు కూడా ఉన్నాయి.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త డుకాటి మాన్‌ స్టర్‌లో 890సీసీ V2 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజిన్‌ను పానిగాలే V2, స్ట్రీట్‌ ఫైటర్ V2, మల్టీస్ట్రాడా V2 మోడళ్లలో కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 111 హెచ్‌పీ పవర్, 91.1 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో పాటు బైడైరెక్షనల్ క్విక్‌ షిఫ్టర్‌ను జత చేశారు. దీంతో గేర్ ఛేంజెస్ మరింత వేగంగా, ఈజీగా కొనసాగనున్నాయి.

ఈ బైక్‌లో వేరియబుల్ ఇంటేక్ వాల్వ్ టైమింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. దీనివల్ల అన్ని రకాల వేగాల్లో కూడా ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో ఉపయోగించిన డెస్మోడ్రోమిక్ వాల్వ్ సిస్టమ్‌ కు బదులుగా కొత్త వ్యవస్థను తీసుకురావడంతో, వాల్వ్ క్లియరెన్స్ చెక్ డ్యూరేషన్ 45,000 కిలోమీటర్ల వరకు పెరిగింది. దీంతో మెయింటెనెన్స్ ఖర్చు కూడా కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. ఇక పాత 4.2 అంగుళాల డిస్‌ప్లే స్థానంలో కొత్త 5 అంగుళాల TFT డిజిటల్ స్క్రీన్‌ను అందించారు.

ధర ఎంత అంటే?

Advertisement

ప్రస్తుతం భారత మార్కెట్లో డుకాటి పానిగాలే V2, స్ట్రీట్‌ ఫైటర్ V2, మల్టీస్ట్రాడా V2 లాంటి పలు ప్రీమియం బైక్‌లను విక్రయిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాన్‌స్టర్ ధర రూ.13.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). కొత్త 2026 మోడల్ ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కొత్త డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్ ప్రీమియం స్పోర్ట్స్ నేకెడ్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందే అవకాశముంది.

Read Also: హోండా సంచలన నిర్ణయం.. భారత్ నుంచే ప్రపంచానికి కొత్త బైక్స్ ఎగుమతులు!

Related News

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

ఈవీ మార్కెట్‌లో సరికొత్త సంచలనం.. సింపుల్ అరైవ్ వస్తోంది!

మారుతి బ్రెజ్జా సూపర్ హిట్.. 15 లక్షల అమ్మకాలతో సరికొత్త రికార్డు!

హోండా సంచలన నిర్ణయం.. భారత్ నుంచే ప్రపంచానికి కొత్త బైక్స్ ఎగుమతులు!

కొత్త టయోటా హిలక్స్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

థార్ రాక్స్ స్టైల్ స్క్రీన్లతో స్కార్పియో N.. లీక్‌లో బయటపడ్డ క్రేజీ డీటైల్స్!

కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!

Big Stories

Advertisement
×