Tanveer Ahmed On Babar Azam: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కు (Tanveer Ahmed) నోటి దూల ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. పొద్దున లేచిన నుంచి పడుకునే వరకు ఇండియాపై ఎలా విషం కక్కాలి అనే దానిపైనే మనోడు పని చేస్తూ ఉంటాడు. టీమిండియా తో పాటు ఐపీఎల్ టోర్నమెంట్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. అయితే లేటెస్ట్ గా టీమిండియా లెజెండరీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid) గురించి విషం కక్కాడు. రాహుల్ ద్రావిడ్ కంటే తమ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం చాలా గొప్పవాడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే బాబర్ ఆజం చుట్టూ చెత్త నా కొడుకులు ఉన్నారని… మంచి ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టులో ఉండి ఉంటే… ధోని అంతటి రేంజ్ కు వెళ్లేవాడని తన్వీర్ అహ్మద్ వెల్లడించారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
బాబర్ ఆజం కెప్టెన్సీ గురించి తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా బాబర్ ఆజంను అందరూ కించపరుస్తూ హేళన చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన మాజీ క్రికెటర్లు దినేష్ కార్తీక్, ఇర్ఫాన్ పఠాన్ లాంటివాళ్ళు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారని ఆగ్రహించారు. ఐసీసీ ట్రోఫీలు బాబర్ ఆజం ఒకటి కూడా గెలవలేదని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ ద్రావిడ్ కూడా తన కెప్టెన్సీలో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదన్న విషయాన్ని మర్చిపోయి.. బాబర్ ఆజంను కించపరుస్తూ రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. బాబర్ ( Babar Azam) చుట్టూ ప్రతిభ లేని ఆటగాళ్లు ఉన్నారని.. ఒంటరి పోరాటం చేయడం వల్ల అతనికి ట్రోఫీలు దక్కడం లేదని తెలిపారు.
విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ( Team India) చాలా విజయాలను నమోదు చేసిందని గుర్తు చేశారు తన్వీర్ అహ్మద్. అయితే వీళ్ళిద్దరూ కెప్టెన్ గా ఉన్న సమయంలో… వాళ్ల చుట్టూ మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, బలమైన బీసీసీఐ మద్దతు చాలా లభించిందని తెలిపారు. ఈ క్రమంలోనే వాళ్లు జట్టును కూడా ముందుకు అవలీలగా తీసుకువెళ్లారని పేర్కొన్నారు. అదే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు పాకిస్తాన్ లో ఉండి ఉంటే, ఇన్ని విజయాలు సాధించకపోవు అంటూ పరువు తీశారు. బాబర్ ఆజం పాకిస్తాన్లో పుట్టి, కష్టాలు అనుభవిస్తున్నాడని ఈ వెల్లడించారు.