Tanveer Ahmed On Rohit and Virat Kohli: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో గిల్ సేన సూపర్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఆటతీరును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు ఉండగా టీమిండియాను ఓడించడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఓపెనర్ గా రోహిత్ శర్మ తన పని ఫినిష్ చేయగా… చివరలో చేజింగ్ చేసి విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపించాడని గుర్తు చేశారు. అనవసరంగా టీమిండియాతో ఆడేందుకు విమానాలలో వెస్టిండీస్ భారతదేశానికి వెళ్లిందని సెటైర్లు పేల్చారు. ఇప్పటికైనా ట్రోఫీ టీమిండియా చేతిలో పెట్టి.. వెనక్కి రావాలని చురకలు అంటించారు. మీరు ఎన్ని ఎత్తులు వేసినా కూడా వాటిని చిత్తు చేస్తారని ROKO కాంబోపై తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, వరల్డ్ కప్ 2027 ట్రోఫీ కూడా ఐసీసీ ముందే టీమిండియాకు ఇచ్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఉన్నన్ని రోజులు టీమిండియాను ఏం పీకలేము అని తన్వీర్ అహ్మద్ వెల్లడించారు. వెస్టిండీస్తో నిన్న జరిగిన తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ ఓపెనింగ్ అదరగొట్టాడని గుర్తు చేశారు. పవర్ ప్లే లో బౌలర్ల పై విరుచుకుబడి 30కి పైగా పరుగులు చేసి… శభాష్ అనిపించుకున్నాడని కొని ఆడారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ… సెంచరీ చేసి మ్యాచ్ ఫినిష్ చేశాడని వెల్లడించారు.
రేపు రెండో వన్డే జరిగితే… రోహిత్ శర్మ అనే మ్యాచ్ ఫినిష్ చేసి చాన్సులు ఉంటాయని తెలిపారు. విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు కాబట్టి కచ్చితంగా… రోహిత్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ లో ఇరగదీస్తాడని వెల్లడించారు. ఇద్దరు ఒకరినొకరు పోటీ పడుతూ పరుగులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడితే ప్రత్యర్ధులు గెలవడం కష్టమేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఒకవేళ ఇద్దరిని తీసుకోకపోతే మాత్రం టీమిండియా గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అవుతుందని హెచ్చరించారు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 303 ఇన్నింగ్స్ లలో 15వేల పరుగులు పూర్తిచేసుకుని సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ 377 ఇన్నింగ్స్ లలో ఈ మార్కు దాటగా కోహ్లీ అంతకన్నా తక్కువ మ్యాచ్ లలోనే ఫినిష్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు.