E-Paper
Advertisement

ఆందోళన చేస్తే లాఠీలతో కొడతారా? గొంతు వినిపించడం నేరమా? సీఎం చంద్రబాబు‌పై జగన్ ఆగ్రహం

ఆందోళన చేస్తే లాఠీలతో కొడతారా? గొంతు వినిపించడం నేరమా? సీఎం చంద్రబాబు‌పై జగన్ ఆగ్రహం
Advertisement

Amaravati: తమ సమస్యలు పరిష్కరించాలని స్వర్ణ గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం జరిగిన పరిణామాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై లాఠీచార్జ్ అత్యంత తీవ్రమైన విషయమన్నారు. వారి డిమాండ్లపై చర్చలు జరపనప్పుడు ప్రజాస్వామ్యయుతంగా గొంతు వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్.

సీఎం చంద్రబాబు‌పై జగన్ ఆగ్రహం

ఆదివారం చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టారు స్వర్ణ గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు. సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనలకు పోలీసులు అనుమతులు నిరాకరించినా వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు అధిక సంఖ్యలో విజయవాడకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉద్యోగులు-పోలీసుల మధ్య ఉద్రిక్తతలు, లాఠీ ఛార్జ్‌లు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై మాజీ సీఎం జగన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

ఆందోళన చేస్తే లాఠీలతో కొడతారా?-జగన్

Advertisement

ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఆందోళన చేస్తే లాఠీలతో కొడతారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

ALSO READ: ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

Advertisement

సీఎం చంద్రబాబు.. ఇది ప్రజాస్వామ్యమేనా? చేతిలో అధికారం ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా? మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ముమ్మాటికీ వెన్నుపోటు పొడవటమేనని రాసుకొచ్చారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్‌ పెట్టారని, ఉద్యోగులు రోడ్డెక్కితే 2 డీఏలు ఇస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. అరియర్స్‌ చెల్లింపుకు వాయిదాలు పెట్టారని, సరెండర్‌ లీవ్స్‌ పెండింగ్ పెట్టారని ఆరోపించారు. ఉద్యోగులు దాదాపు రూ.4౦వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు.

https://twitter.com/ysjagan/status/2104248114890920043

 

 

 

Related News

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

Big Stories

Advertisement
×