Big update on Team India : టీమిండియా టీ-20లకు ప్రస్తుతం కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు శుబ్ మన్ గిల్, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే కొద్ది రోజుల తరువాత కేవలం ఇద్దరూ కెప్టెన్లు మాత్రమే మూడు ఫార్మాట్లకు ఉండనున్నట్టు సమాచారం. రోహిత్ శర్మ తరువాత వన్డే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ని బీసీసీఐ పరిగణిస్తోంది. సూర్య కుమార్ యాదవ్ తరువాత శుబ్ మన్ గిల్ ని టీ-20 కెప్టెన్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా ఉన్న అక్సర్ పటేల్ తప్పించి.. గిల్ ను ఆసియా కప్ 2025 కి వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. మూడు ఫార్మాట్లలో ఇద్దరూ కెప్టెన్లతో బీసీసీఐ ముందుకు వెళ్లాలని చూస్తోంది.
Also Read : Shreyas Iyer : ఫ్యాన్స్ దెబ్బకు దిగివచ్చిన BCCI.. శ్రేయాస్ అయ్యర్ కు కీలక పదవి… ఏకంగా కెప్టెన్సీనే
ఆసియా కప్ తరువాత.. వన్డేలపై ఫోకస్..
ఆసియా కప్ ముగిసిన తరువాత వన్డేలపై చర్చ జరుగనున్నట్టు సమాచారం. మరోవైపు జట్టు మేనేజ్ మెంట్ మాత్రం శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కి ఎక్కువ కాలం నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని భావిస్తోంది. ఇక శ్రేయాస్ అయ్యర్ కి వన్డే కెప్టెన్సీ ఎప్పుడనేది మాత్రం రోహిత్ శర్మ నిర్ణయం తరువాత నిర్ణయిస్తారు. ఆసియా కప్ లో టీమిండియా రాణించకపోతే.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని పక్కకు పెట్టి గిల్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సూర్యకుమార్ పేలవ ప్రదర్శన కనబరిస్తే.. అతన్ని పక్కకు పెట్టనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ కి ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. గత వారం 2, 4 ర్యాంకింగ్స్ లో ఉన్న వీరిద్దరూ వారం తిరిగేలోపు ర్యాంకింగ్స్ నుంచి పూర్తిగా మాయమైపోయారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో రోహిత్, కోహ్లీ పేర్లు కనిపించలేదు. ఇది చూసి వారి అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
వన్డే కెప్టెన్సీ పై రకరకాల రూమర్స్..
ఇలా జరగడంలో ఐసీసీ తప్పిదం ఏదైనా ఉందా..? అని ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఒక్క ఆటగాడు 9 నుంచి 12 వరకు సంబంధిత ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. కానీ రోహిత్, కోహ్లీ విషయం లో అలా జరుగలేదు. వీరిద్దరూ చివరగా మార్చి 09న ఐదు నెలల కిందట ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. వీరిద్దరూ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఈ ఫార్మాట్ లో కొనసాగుతామని కూడా వెల్లడించారు. మరోవైపు బీసీసీఐ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బలవంతంగా వన్డేల నుంచి తప్పుకునేలా చేస్తుందననే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే వన్డే ర్యాంకింగ్స్ నుంచి వారి పేర్లను తొలగించేలా ఐసీసీ కి లేఖ రాసి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగి ఉంటుందని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులను పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రేయస్ అయ్యర్ కి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం.
🚨 BIG UPDATE ON TEAM INDIA 🚨 (Abhishek Tripathi).
– BCCI considering Shreyas as ODI Captain after Rohit.
– Gill will become T20 Captain after Surya.
– BCCI is looking to move forward with 2 Captains in three formats.
– After Asia Cup, The discussion will happen for ODIs.
– The… pic.twitter.com/LYTk5xnLSt— Tanuj (@ImTanujSingh) August 21, 2025