Tim David : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం అనే చెప్పాలి. ఎప్పుడూ ఏ ఆటగాడు అద్భుతంగా రాణిస్తాడో.. ఏ ఆటగాడు పేలవ ప్రదర్శన కనబరుస్తాడో చెప్పలేము. ఎందుకు అంటే ఇవాళ ఆడిన ఆటగాడు రేపు ఆడటం లేదు. అనుకోకుండా కొత్త కొత్తగా రికార్డులను నమోదు చేస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్నాడని ఒక ఆటగాడిని తీసుకుంటే.. అతను ఫామ్ కోల్పోతున్నాడు. మరో కొత్త ఆటగాడు ఫామ్ లో ఉంటున్నాడు. ఇది నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టీ-20ల సిరీస్ జరుగుతోంది. అయితే ఇప్పటికే రెండు టీ-20లలో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. ఇవాళ మూడో టీ-20లో కూడా ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించడం విశేషం.
Also Read : Watch Video : క్రికెట్ లోకి సరికొత్త బ్యాట్.. ఇక సిక్స్ లు, బౌండరీలే.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
ఆకాశమే హద్దుగా..
ఇదిలా ఉంటే.. ఇవాళ జరిగిన 3వ టీ-20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. వెస్టిండీస్ బౌలర్ మోతీ వేసిన 10 ఓవర్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి బంతికి ఫోర్ కట్టగా.. ఆ తరువాత బాల్ డాట్ అయింది. అనంతరం 4 బంతులను సిక్స్ లు గా మలిచాడు. దీంతో ఆ ఓవర్ లో 28 రన్స్ వచ్చాయి. ఆ తరువాత 2 ఓవర్లలో వరుసగా 20, 23 రన్స్ వచ్చాయి. దీంతో కేవలం 18 బంతుల్లో 71 పరుగులు చేసింది ఆస్ట్రేలియా జట్టు. ఇక టిమ్ డేవిడ్ వీర విహారం చేశారు. ఇందులో 11 సిక్సర్లు, 6 ఫోర్లతో రెచ్చిపోయారు. 37 బంతుల్లోనే శతకం బాదారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు తరపున ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు డేవిడ్. 37 బంతుల్లో సెంచరీ చేయగా.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
ఫాస్టెస్ సెంచరీ.. హాఫ్ సెంచరీ
అటు ఓవరాల్ గా టీ-20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఈస్టోనియా ఫ్లేయర్ సాహిల్ చౌహన్ పేరిట ఉంది. ఈ మ్యాచ్ లో గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు 5 టీ-20 మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు టీ-20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇటీవల టెస్టు సిరీస్ లో కూడా ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్ జట్టు టెస్టుల్లో, టీ-20 రెండింటిలో ఓటమి పాలైంది. ఇక ఆస్ట్రేలియా జట్టు అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతుంది. గత టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో ఓటమి పాలైన తరువాత మళ్లీ పుంజుకొని అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా భారత్ పై అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటికే 3 టెస్టు మ్యాచ్ లు జరిగితే రెండింటిలో విజయం సాధించింది ఇంగ్లాండ్.. ఇక నాలుగో టెస్టులో కూడా ఇంగ్లాండ్ లీడ్ లో కొనసాగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా సిరీస్ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఏమైనా టీమిండియా బౌలర్లు మ్యాజిక్ చేస్తే.. తప్పా సిరీస్ విజయం సాధించలేరనే చెప్పాలి.
Tim David reveals the bat trade with 'Dre Russ' that helped seal a "childhood dream" as he notched his maiden international century! #WIvAUS
Read more: https://t.co/l0lBZcrB0C pic.twitter.com/IQS3C1vA6U
— cricket.com.au (@cricketcomau) July 26, 2025