Bumrah : టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతని యార్కర్లతో ప్రత్యర్థులు బ్యాటింగ్ చేయాలంటే ముచ్చెమటలు పట్టాల్సిందే. గతంలో టీమిండియా బౌలర్లు భువనేశ్వర్ కుమార్, బుమ్రా ఇద్దరూ కలిసి బౌలింగ్ బాగా చేసి వికెట్లు తీసేవారు. ఆసియా కప్ 2025లో బుమ్రా వేసిన యార్కర్ కి యూఏఈ బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆ బ్యాటర్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. తాజాగా బుమ్రా గ్రౌండ్ లో పెయింటింగ్ వేశాడు. అతను వేసిన పేయింటింగ్ తన ఫ్యామిలీకి సంబంధించినదిగా తెలుస్తోంది. సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుమ్రా బౌలింగ్ తో పాటు పేయింటింగ్ కూడా వేస్తాడా..? అని చర్చించుకోవడం విశేషం.
Also Read : Asia Cup 2025: పాకిస్థాన్ చేతిలో ఓడితే… టీమిండియా ప్లేయర్లను దేవుడు కూడా కాపాడలేడు !
వాస్తవానికి బుమ్రా టీమిండియాలో కీలక బౌలర్ గా రాణిస్తున్నాడు. టీ-20, వన్డే, టెస్ట్ క్రికెట్.. ఫార్మాట్ ఏదైనా రప్పాడించేస్తున్నాడు ఈ స్పీడ్ బౌలర్. యార్కర్లతో యమ స్పీడ్ గా బంతులను విసురుతాడు. బుమ్రా బౌలింగ్ చూసి ఎవ్వరైనా భయపడిపోవాల్సిందే. మరోవైపు సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. టీమిండియా పాకిస్తాన్ పై ఎవరెవరినీ ఆడిస్తుందనేది చాలా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఆసియా కప్ 2025లో బుమ్రా, అతని భార్య సంజనా గణేశన్ డబ్బులు బాగానే సంపాదిస్తారని నెటిజన్లు పేర్కొంటున్నారు. బుమ్రా మైదానంలో మ్యాచ్ లు ఆడి డబ్బులు సంపాదిస్తే.. సంజనా మాత్రం ఈ మల్టీ నేషనల్ టోర్నమెంట్ లో కామెంటరీ, యాంకరింగ్ ద్వారా డబ్బు సంపాదించనుంది.
బుమ్రా, సంజనా ల ప్రేమకథ తొలుత క్రికెట్ ఫీల్డ్ నుంచే మొదలైంది. ఇప్పుడు భార్యభర్తలుగా మారిన తరువాత కూడా వారిద్దరూ క్రికెట్ ఫీల్డ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. బుమ్రా ఇప్పటికే ఆసియా కప్ లో ఆడుతున్నాడు. కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా ఆసియా కప్ కోసం ఇంగ్లీషు కామెంటరీ ప్యానెల్ లో సంజనా గణేశన్ కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు భార్యభర్తలిద్దరూ ఆసియా కప్ లో డబ్బు బాగానే సంపాదిస్తున్నారన్న మాట. తాజా నివేదిక ప్రకారం.. సంజనాకి ఆసియాకప్ లో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు మాత్రమే రావచ్చని అంచనా వేశారు. ఇక బుమ్రా కి మాత్రం ఆసియా కప్ 2025లో అతనికి ఒక్కో మ్యాచ్ కి దాదాపు రూ.3లక్షల వరకు రావచ్చు. కేవలం ఇది అతని మ్యాచ్ ఫీజు మాత్రమే. దీంతో పాటు అతని మంచి ప్రదర్శనకు అదనపు ప్రోత్సహకాలు కూడా లభిస్తాయి. మొత్తం మీద చూస్తే.. వీరిద్దరి ఆదాయం లక్షల్లో ఉండనున్నట్టు సమాచారం. ఆసియా కప్ 2025 ఇంగ్లీషు కామెంటరీ కోసం భారత్ నుంచి ఆరుగురు కామెంటేటర్లను ఎంపిక చేసారు. జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ ఒకరు. ఆమె తో పాటు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, సంజయ్ ముంజ్రెకర్, రాబిన్ ఉతప్ప, సమీర్ కోచర్ వంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.