
Mohammad Shami : మహ్మద్ షమీ..నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచకప్ లో ఆకట్టుకుంటున్నాడు. నాలుగు మ్యాచ్ లు దూరంగా ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీశాడు. అందులో రెండుసార్లు ఐదేసి వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇక నవంబర్ 15న జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ షమీ ప్రదర్శన కీలకం కానుంది. అందుకే ఇలాంటి సమయంలో ఒక హీరోయిన్ మహ్మద్ షమీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. నా నుంచి నీకేం కావాలో చెప్పు..కానీ ఒక కండీషన్ అంటూ చిన్న మెలిక పెట్టింది.
ఇండియా ఆడబోయే రెండు నాకౌట్ మ్యాచ్ ల్లో, అంటే సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలో షమీ అద్భుత ప్రదర్శన చేయాలని కోరింది. అందుకు తన నుంచి ఎటువంటి సహాయం ఆశిస్తున్నాడో చెప్పమని అడిగింది. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా నటించిన పాయల్ ఘోష్. ఇంతకీ తన పోస్ట్ లో సారాంశం ఏమిటంటే.. ‘షమీకి ప్రపోజ్ చేస్తూ..నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ అందుకు ఒక ప్రత్యేక షరతు..అని చెప్పింది. అదేమిటంటే ముందు నువ్వు ఇంగ్లీషు మెరుగుపరుచుకోవాలి. అప్పుడు నేను సిద్దమని తెలిపింది.
దీని తర్వాత మళ్లీ ఏమనుకుందో.. మరొకటి ట్వీటింది. షమీ..నువ్వు సెమీఫైనల్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి నీకే సహాయం కావాలి అని అడిగింది. ముందు మన ఇండియా ఫైనల్ లో నిలవాలి. నిన్ను హీరోగా చూడాలని అనుకుంటున్నాను అని తెలిపింది. ఈ ట్వీట్ పై నెటిజస్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. పాయల్ నిజంగానే షమీకి ప్రపోజ్ చేసిందా? లేక పబ్లిసిటీ కోసం ఇలా దారి తప్పిందా? అని అంటున్నారు.
అయితే ఇటీవల మహ్మద్ షమీ వివాహం విడాకుల వరకు వెళ్లిందనే సంగతి అందరికీ తెలిసిందే. భార్య హాసిన్ జహాన్ తో 2014లో షమీకి పెళ్లి జరిగింది. ఒక కుమార్తె కూడా కలిగింది అయితే 2018లో హాసిన్ కోర్టులో కేసు వేసింది. షమీ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తెలిపింది. దీంతో కోర్టు ఇటీవల తీర్పు చెబుతూ ఆమెకు ప్రతినెలా భరణంగా నెలకు రూ. 1.30 లక్షలు ఇవ్వమని చెప్పింది. ప్రస్తుతం వారిద్దరూ విడిగా ఉంటున్నారు.
ఇదిలా ఉండగానే షమీ ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన జరుగుతుండగా ఒక టీవీ షో ప్రశ్నకు మాజీ భార్య హాసన్ సమాధానం చెప్పింది. నాకు క్రికెట్ అంటే పెద్ద ఇష్టం లేదు. కానీ షమీ మంచిగా ఆడుతున్నాడంటే మా కుటుంబానికి మంచిదే కదా అంది. అంటే తను ఎక్కువ సంపాదిస్తే, అవి తమకే కదా..అన్న భావనతో మాట్లాడింది. అంతే కాదు నేను, నా కూతురు, షమీ అంతా ఒకటేననే భావన వచ్చేలా మాట్లాడింది. అది కూడా వైరల్ అయ్యింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మాటలతో మరింత వేడెక్కింది.