
World Cup 2023 Final : సరిగ్గా 20 ఏళ్ల క్రితం…2003లో ఇదే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో టాస్ దగ్గర నుంచి బౌలింగ్ వరకు అన్నీ ప్రయోగాలు చేసుకుంటూ వెళ్లారు. అవన్నీ వికటించి ఆసిస్ తుక్కు రేగ్గొట్టి వదిలేసింది. ఛేజింగ్ లో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ప్రయోగాలు చేయవద్దని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
అప్పుడు కూడా జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా లీగ్ మ్యాచ్ ల్లో కుమ్మీశారు. ఫైనల్ లో ఒక్క వికెట్టు తీయలేకపోయారు. తీసిన రెండు వికెట్లు కూడా హర్భజన్ వల్ల వచ్చినవి…అందుకే ఇంతకుముందు ఎలా ఆడారో అలాగే ఆడమని చెబుతున్నారు.
రోహిత్ శర్మ ఎప్పటిలా పవర్ ప్లే లో ఎటాకింగ్ ఆడి, మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గించాలని చెబుతున్నాడు. శుభ్ మన్ గిల్ ఫైనల్ లో మెరవాలని కోరుతున్నారు. కొహ్లీ ఈ ఒక్క మ్యాచ్ మరింత మనసు పెట్టి ఆడాలని చెబుతున్నారు. శ్రేయాస్, రాహుల్ సిక్స్ లు, ఫోర్లతో స్కోరు బోర్డుని పరుగులెత్తించాలని ఆశిస్తున్నారు. ఎప్పటిలా పేస్ త్రయం, ముఖ్యంగా షమీ సెమీస్ ఫీట్ ని రిపీట్ చేయాలని కోరుతున్నారు.త
గౌతమ్ గంభీర్ ఏమంటున్నాడు…?
ఆసిస్ లీగ్ మ్యాచ్ ల్లో అంత గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. ఆఖరికి సెమీస్ లో కూడా అంతంతమాత్రమే. సౌతాఫ్రికా స్వీయ తప్పిదాల వల్లే ఓటమి పాలయ్యింది. అందుకని తేలిగ్గా అంచనా వేయవద్దని, ఇప్పటివరకు ఎలా ఆడుతూ వచ్చారో…అలాగే ఆడండి. గేమ్ ప్లాన్ ఏమీ మార్చొద్దు, టీమ్ ని మార్చొద్దని గౌతమ్ గంభీర్ చెప్పాడు.
వరల్డ్ కప్ మనదే: రవిశాస్త్రి
టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ టీమ్ఇండియా స్పిరిట్ చూస్తుంటే వరల్డ్ కప్ మనదే, అందులో తిరుగులేదు. అందరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఒకరిని మించి ఒకరు రాణిస్తున్నారని అన్నాడు. అంతేకాదు అటు బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉందని చెబుతున్నాడు. అందువల్ల నో డౌట్ కప్ మనదేనని అన్నాడు.
ఫైనల్ మ్యాచ్ లో వందశాతం ఎఫర్ట్ పెడతాం: కెప్టెన్ రోహిత్ శర్మ
ఇంతవరకు టీమ్ ఇండియాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ అనే కాదు, ప్రతి మ్యాచ్ గెలవాలని ఆటగాళ్లందరం వందశాతం ఎఫర్ట్ పెడతాం. గెలవాలనే తపనతోనే ఆడతామని అన్నాడు. కొహ్లీ , గిల్, రాహుల్, అయ్యర్, షమీ, బుమ్రా, సిరాజ్ ఇలా అందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారని అన్నాడు.