Big Stories

PM Modi’s Foreign Policy: మోదీ 3.0 ఫారిన్ పాలసీ.. ఎలా ఉండబోతోంది..?

PM Modi’s Foreign Policy Priorities: నరేంద్ర దామోదర్ దాస్ మోడీ.. సరికొత్త చరిత్రను సృష్టిస్తూ భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. 71 మందితో కొత్త మంత్రివర్గాన్ని కూడా కొలువుదీర్చారు. సో పార్టీల ఈక్వేషన్స్‌ ముగిశాయి. పాలిటిక్స్‌ పంచాయితీకి ఎండ్‌ కార్డ్ పడింది. అంటే ఇక సంబరాల సమయం ముగిసింది. మోడీ ప్రభుత్వం ఇక పనిపై ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చింది. అలా ముగిసింది ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం. ఇక చార్జ్‌ తీసుకోగానే కీలక ఫైల్స్‌పై సంతకాలు చేసేశారు మోడీ. ఫస్ట్ సైన్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఫైల్‌పై చేశారు.

- Advertisement -

అయితే అందరి ఇంట్రెస్ట్ మాత్రం మోడీ ఫారిన్ పాలసీ ఎలా ఉండబోతుంది? అనే దానిపై కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకు విదేశాంగ విధానంపైనే ఫస్ట్ ఫోకస్ అంటే.. ఈ నెలలో కొన్ని కీ ఈవెంట్స్ జరగనున్నాయి. ఫస్ట్‌ రష్యాలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. సో.. ఇది మోడీ కేబినెట్‌కు ఫస్ట్ అసైన్‌మెంట్.. సెకండ్‌ ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలో జీ7 సమ్మిట్ జరగనుంది. దీనికి మోడీ స్వయంగా హాజరుకానున్నారు. ఇది అలా ముగుస్తుందో లేదో.. ఆ వెంటనే స్విట్జర్లాండ్‌లో మరో గ్లోబల్ పీస్‌ సమ్మిట్ జరగనుంది. ఇందులో రష్యా-ఉక్రెయిన్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీ 15, 16వ తేదీల్లో జరుగుతుంది. అయితే ఈ మీట్‌కి ఇండియా అటెండ్ అవుతుందా? లేదా? అనేది ఇంకా కన్ఫామ్ కాకపోయినా చాలా వరకు వెళ్లే అవకాశమే కనిపిస్తుంది.
ఇవన్నీ కాకుండా యూఎస్ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సులీవన్‌ కూడా ఇండియాకు రానున్నారు. సో.. ఇండియా-యూఎస్ మధ్య మరోసారి కీలక చర్చలు.. ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తుంది.

- Advertisement -

సో.. వరుస ఈవెంట్స్ ఉన్నాయి.. అన్ని మన విదేశాంగ పాలసీకి సంబంధించినవే.. అందుకే కేంద్రం ఎలాంటి అడుగులు వేస్తుంది అనే దానిపైనే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. నిజానికి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశాంగ విధానంలో కొత్త మార్పు వచ్చింది. ఇండియా గ్లోబల్ ఐకానిక్‌గా మారింది. ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా చేశారు మోడీ అందుకే ఇండియాను గ్లోబల్‌ లీడర్‌గా మార్చేందుకు ఇప్పుడు కూడా ఎలాంటి విధానాలను ఫాలో అవుతారన్న క్యూరియాసిటీ నెలకొంది.

Also Read: Bird Flu H9N2: భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు.. నాలుగేళ్ల చిన్నారికి పాజిటివ్

బట్.. తన ప్రమాణస్వీకారంతోనే మోడీ ఒక విషయాన్ని చెప్పకనే చెప్పారు. మన చుట్టుపక్కల ఉన్న దేశాధినేతలను ఆహ్వానించి ”నైబర్‌హుడ్ ఫస్ట్” అనే పాలసీని ప్రకటించారు. అఫ్‌కోర్స్.. కేంద్రం ఇదే పాలసీని అనేక ఏళ్ల నుంచి ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పకనే చెప్పారు. ఇక ఇండో పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టనుంది ఇండియా తీర జలాల్లో చైనాకు చెక్‌ పెట్టేందుకు 12 దేశాలతో కలిసి ఇండో పసిఫిక్‌ ఓషియన్ ఇనిషియేటివ్‌ను చేపట్టింది కేంద్రం.. ఇప్పుడు మోడీ థర్డ్ టర్మ్‌లో ఇది మరింత దూసుకుపోనుంది. యాక్ట్ ఈస్ట్‌ పాలసీ.. 2014 వరకు లుక్ ఈస్ట్ పాలసీని కొనసాగించిన యూపీఏకు అప్‌డేట్‌గా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే ఈ పాలసీని తీసుకొచ్చింది. ఇప్పుడీ పాలసీ టెన్ ఇయర్స్ యానివర్సీ చేసుకుంటుంది. సో కొత్త ఏజెండాతో ఈ పాలసీని మరింత అప్‌గ్రేడ్ చేయనున్నారు. జపాన్, కొరియా, ఆస్ట్రేలియాతో బంధాన్ని మరింత ధృడంగా చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

మోడీ థర్డ్‌ టర్మ్‌లో అమెరికాతో కూడా బంధం మరింత బలపడే చాన్స్ కనిపిస్తోంది. అమెరికా నుంచి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌, టెక్నాలజీని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇండియా.. సెమి కండక్టర్ ఇండస్ట్రీలో సొంతంగా ఎదగాలని చూస్తుంది ఇండియా ఇలాంటి టెక్నాలజీ ఏరియాలో అమెరికా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇండియా.. అంతేకాదు బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కార్పొరేషన్‌లో కూడా ఇండియా ప్రాతినిధ్యం పెరగనుంది. ఈ ఏడాది ఈ లిస్ట్‌లో మలేసియా, ఇండోనేషియా, సింగపూర్‌ను కూడా చేర్చుకోనున్నారు. సో మరిన్ని దేశాలతో భారత్ బంధం బలపడనుంది.

Also Read: అలా మాట్లాడినందుకే కంగనాను కానిస్టేబుల్ కొట్టింది: పంజాబ్ సీఎం

మోడీ సర్కార్ విశ్వబంధు అనే కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. గ్లోబల్‌గా కీ రోల్ ప్లే చేయాలన్నది దాని ఉద్దేశం.. అంతేకాదు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని కూడా టార్గెట్‌గా పెట్టుకుంది. వచ్చే 25 ఏళ్ల ప్రొగ్రామ్‌ను డిజైన్‌ చేసుకొని దానికి వికసిత్ భారత్ అని నామకరణం చేసుకుంది. ఇప్పుడీ ప్లాన్స్‌ను కూడా కంటిన్యూ చేయనుంది మోడీ సర్కార్.. ప్రస్తుతానికి మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్‌తో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఎవరికి వత్తాసు పలకకుండా అన్ని దేశాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుంది. మోడీ థర్డ్ టర్మ్‌లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఇక మన దేశ పరిస్థితులను చూస్తే.. మనకు పక్కలో బల్లెంలా ఎప్పుడూ ఉండే దేశాలు చైనా, పాకిస్థాన్.. అటు చైనాకు, ఇటు పాక్‌కు ఏకకాలంలో చెక్‌ పెట్టేందుకు మోడీ కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు Pokని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది మోడీ సర్కార్.. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాను ఎలా నిలువరిస్తారు..? భారత్‌కు వ్యతిరేకంగా మారుతున్న మయన్మార్, శ్రీలంక, మాల్దీవ్స్‌ను ఎలా దారికి తీసుకువస్తారు? అన్నింటికంటే రోజురోజుకు తీవ్రంగా మారుతున్న ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని ఎలా కంట్రోల్ చేస్తారనే దానిపై కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది కేంద్ర సర్కార్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News