Yuvraj Singh: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ {ఐఎంఎల్} ఫైనల్ లో వెస్టిండీస్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఇండియన్ మాస్టర్స్. రాయ్ పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియన్స్ మాస్టర్స్ జట్టు 149 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేదించి ఛాంపియన్షిప్ ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా విజయం నల్లేరు మీద నడకలా సాగింది.
149 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలో ఆరు వికెట్ల తేడాతో చేదించి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు డ్వెన్ స్మిత్ {45}, సిమన్స్ {57} సాయంతో 20 ఓవర్లలో ఏడు వికెట్లను నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బలిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాత రోజులను గుర్తు చేస్తూ అద్భుతమైన షాట్స్ తో మైమరిపించాడు.
మరోవైపు అంబటి రాయుడు కూడా హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. ఇక సచిన్ టెండూల్కర్, గుర్కీరత్ సింగ్ అవుట్ అయిన తర్వాత 12వ ఓవర్ లో యువరాజ్ సింగ్ క్రీజ్ లోకి వచ్చాడు. అనంతరం రెండు ఓవర్ల తర్వాత వెస్టిండీస్ బౌలర్ టినో బెస్ట్ పై యువరాజ్ సింగ్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. అయితే దీనికి టోనీ కూడా అదే రేంజ్ లో కౌంటర్ వేశాడు. ఇక వీరిద్దరి మధ్య మాట మాట పెరగడంతో అది గొడవకు దారి తీసింది.
దీంతో యువరాజ్ కి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు అంబటి రాయుడు. అయినా యూవీ వెనక్కి తగ్గకపోవడంతో వెంటనే వెస్టిండీస్ కెప్టెన్ లారా, అంపైర్ బిల్లీ బౌడెన్ రంగంలోకిదిగి.. వీరిద్దరినీ కంట్రోల్ చేశారు. ఆ తర్వాత ఓవర్ లో సిక్స్ కొట్టిన యువరాజ్ సింగ్.. బ్యాట్ ని బెస్ట్ వైపు చూపించడం గమనార్హం. దీంతో 2007 టీ-20 ప్రపంచ కప్ లోను ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
అంతకుముందు ఆండ్రూ ఫ్లింటాఫ్ – యువరాజ్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఎఫెక్ట్ బ్రాడ్ పై పడింది. అప్పుడు కూడా అదిరిపోయే సిక్స్ కొట్టిన యువరాజ్.. తనదైన శైలిలో బెస్ట్ నీ టార్గెట్ చేశాడు. ప్రారంభం నుండి సజావుగా సాగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టి-20.. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఇలాంటి గొడవ జరిగింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం టినో యువరాజ్ సింగ్ తో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కనిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ కోపాన్ని చూసిన భారత క్రీడాభిమానులు ఒక్కసారిగా పాత రోజులను గుర్తు తెచ్చుకున్నారు. దీంతో ఈ గొడవకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">