BigTV English

Radhika Yadav Shot dead : రీల్స్ చేసిందని.. టెన్నిస్ ప్లేయర్‌ను కాల్చి చంపిన తండ్రి

Radhika Yadav Shot dead : రీల్స్ చేసిందని.. టెన్నిస్ ప్లేయర్‌ను కాల్చి చంపిన తండ్రి

Radhika Yadav Shot dead :  భారత టెన్నిస్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ప్రముఖ టెన్నీస్ ప్లేయర్ రాధికా యాదవ్ ని కాల్చి చంపారు. గురుగ్రామ్ లోని సుశాంత్ లోక్ -2లోని తన నివాసంలో రాధికను హత్య చేసారు. అత్యంత దిగ్బ్రాంతికరమైన విషయం ఏంటంటే..? రాధిక ను ఆమె తండ్రే కాల్చి చంపాడు. రాధిక తండ్రి తన లైసెన్స్ రివాల్టర్ తో మూడు బుల్లెట్లను కూతురును చంపేందుకు పేల్చాడు. ఈ కేసు దర్యాప్తు లో గురు గ్రామ్  పోలీసులు రాధిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్ పోలీసులు చేసిన ప్రాథమిక దర్యాప్తు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధిక తండ్రికి తన కుమార్తె రీల్స్ చేసే అలవాటు పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. రాధిక రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుండేది. ఈ విషయం పై రాధిక తండ్రి తన కుమార్తెను మూడు సార్లు కాల్చాడు. దీంతో రాధిక మరణించింది.


Also Read :  Gill – NKR : ‘బాగుందిరా మామా..’ నితీష్ కుమార్ రెడ్డి ని ఉద్దేశించి గిల్ డైలాగ్.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

రాధిక హత్య తో అంతా షాక్.. 


ఇక దీంతో రాధిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాధిక తండ్రి హత్య చేసేందుకు ఉపయోగించిన రివాల్వర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మార్చి 23, 2000లో జన్మించింది రాధిక. ఇక ఆమె వయస్సు 25 సంవత్సరాలు. రాధిక యాదవ్ టెన్నిస్ క్రీడాకారిణి. అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి ప్రాతినిధ్యం వహించింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ టెన్నీస్ ప్లేయర్ లో రాధిక ర్యాంకింగ్ 113. ITF డబుల్స్ లో టాప్ 2000 లో రాధికకు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. రాధికా యాదవ్ దేశానికి చెందిన వర్దమాన క్రీడాకారిణి. కానీ ఆమె తండ్రే ఆమె జీవితాన్ని ముగించాడు. రాధికా యాదవ్ టెన్నీస్ ప్రయాణం ప్రారంబం కాకముందే ఆమె జీవిత ప్రయాణం ముగిసిపోయింది. ఇక ఈ వార్త బయటపడగానే గురుగ్రామ్ లోని సెక్టార్ 57లో నిశ్చబ్దం అలుముకుంది. చుట్టు పక్కల ప్రజలందరూ ఈ సంఘటనతో దిగ్బ్రాంతికి గురయ్యారు. రాధిక హత్య అందరినీ షాక్ కి గురి చేసింది.

కన్న తండ్రే ఇలా.. 

ఇక ఓ వర్థమాన క్రీడాకారిణి ఇలా విషాదకరంగా మరణించడం చాలా బాధాకరమనే చెప్పాలి. ముఖ్యంగా కన్న తండ్రే కసాయిలా మారి ఈ ఘాతుకానికి పాల్పడటం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ కారణంగా సోషల్ మీడియా రీల్స్ చేయడం వంటి చిన్న చిన్న కారణాలకే ఇంత పెద్ద నేరానికి ఒడిగట్టడం సమాజానికి ఓ హెచ్చరిక అనే చెప్పాలి. ఇలా చిన్న చిన్న వాటికి చంపుకుంటూ పోతే ఈ భూమి మీద జనాలే మిగలరు అని పలువురు పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా చాలా కీలకం అయింది. ఇదివరకు అంటే ఫోన్లు లేవు.. ఎవ్వరి గురించి ఎలాంటి సమాచారం తెలిసేది కాదు. ప్రస్తుతం మొబైల్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత టెక్నాలజీ పెరగడం.. సోషల్ మీడియాలో ప్రతీ చిన్న విషయాన్ని పోస్టు చేయడం ట్రెండ్ గా మారింది. కుానీ సోషల్ మీడియాలో రీల్స్ చేసిన కూతురు ని చంపడం దారుణమనే చెప్పాలి. ఇలాంటి ఘటనలు జరుగకుండా రాధిక తండ్రికి కోర్టు తగిన బుద్ది చెప్పాలని పలువురు కోరుకుంటున్నారు.

 

Related News

Sachin-Sara : సచిన్ కు షాక్… సంపాదనలో తండ్రిని దాటిన సారా టెండూల్కర్.. ఒక్క పోస్టుకు ఎంత రేటు అంటే

Harbhajan Singh : భ‌జ్జీ రియ‌ల్ హీరో…వ‌ర‌ద బాధితుల కోసం భారీ సాయం..3 అంబులెన్సులు కూడా

Rishab Pant : చిన్నపిల్లడిలా కటింగ్ చేయించుకున్న పంత్… టీమిండియాలోకి రీ ఎంట్రీ అప్పుడే..

Rohit Sharma: ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ…ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..అస‌లు ఏమైంది

Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

Virat Kohli: విరాట్ కోహ్లీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా… టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్‌!

×