E-Paper
Advertisement

Yograj Singh: పాకిస్తాన్ కొత్త కోచ్‌గా యువరాజ్ తండ్రి.. ?

Yograj Singh: పాకిస్తాన్ కొత్త కోచ్‌గా యువరాజ్ తండ్రి.. ?
Advertisement

Yograj Singh: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డిపెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టింది. ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయిన పాకిస్తాన్.. ఆదివారం రోజు దుబాయిలో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇక గ్రూప్ దశలో పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఆడాల్సి ఉన్నా.. అది నామ మాత్రమే. సోమవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో.. పాకిస్తాన్ అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకుంది.

 

Advertisement

ఒకవేళ ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచి ఉంటే పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా ఉండేవి. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో పాకిస్తాన్ కధ టోర్నీ ప్రారంభమైన కేవలం ఆరు రోజులలోనే తేలిపోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్.. ఇలా చాలామంది ప్రస్తుతం పాకిస్తాన్ జట్టును మార్చడం గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ యోగరాజ్ సింగ్ {Yograj Singh} కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో యోగరాజ్ సింగ్.. తనని పాకిస్తాన్ జట్టు కోచ్ గా నియమిస్తే.. ఆ జట్టు పరిస్థితిని, దశ దిశలను మారుస్తానని చెప్పినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో యోగరాజ్ మాట్లాడుతూ.. ” కొన్నిసార్లు నాకు పాకిస్తాన్ జట్టుకు ఫోన్ చేసి.. మీకు సరైన కోచ్ లేకపోతే, మీ జట్టుని ఒక సంవత్సరం పాటు నాకు అప్పగించండి. నేను మీ జట్టు సభ్యులను సింహాలుగా మారుస్తాను” అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో మీరు పాకిస్తాన్ కోచ్ అవుతారా..? అని ప్రశ్నించడంతో.. ” అందులో సమస్య ఏముంది” అని బదులిచ్చాడు.

Advertisement

 

అంతేకాకుండా భారత్ – పాకిస్తాన్ ఇద్దరూ సోదరుడు లాంటివారని.. వారు ఈరోజు కాకపోయినా రేపు కచ్చితంగా కలుస్తారని చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు. పాకిస్తాన్ జట్టులో 150 కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆ చెట్టులో మంచి వ్యవస్థ లేదని అన్నాడు. దీంతో యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక యోగరాజ్ 1980 డిసెంబర్ 21న ఆస్ట్రేలియా తో బ్రిస్ బెన్ లో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. సునీల్ గవాస్కర్ సారధ్యంలో యోగరాజ్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. కానీ అతడు అంతర్జాతీయ కెరీర్ కేవలం మూడు నెలలకే పరిమితమైంది. యోగరాజ్ తన కెరీర్ లో ఒక టెస్ట్, ఆరు వన్డేలు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత క్రికెట్ కి గుడ్ బై చెప్పి.. సినిమాలలో నటించాడు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×