BigTV English

Kingfisher Beer Price: కింగ్ ఫిషర్ బీరు ఒక్కటి రూ.30 మాత్రమే! నమ్మలేదు కదా ఇది నిజం.. ఎక్కడంటే?

Kingfisher Beer Price: కింగ్ ఫిషర్ బీరు ఒక్కటి రూ.30 మాత్రమే! నమ్మలేదు కదా ఇది నిజం.. ఎక్కడంటే?

Kingfisher Beer Price: బీరు బాటిల్ రూ.30కే? పక్కా నమ్మకంగా లేకపోయినా ఇది నిజం. దేశంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కింగ్ ఫిషర్ బీర్ అక్షరాలా అన్నదానంగా కనిపిస్తోంది. ఎందుకంటే తయారీకి వచ్చే అసలు ఖర్చు తెలియని చాలా మంది, బార్‌లో లేదా షాపుల్లో చూసే ధరలే నిజమైన ధర అనుకుంటున్నారు. కానీ ఇంత చవకగా ఇది ఎక్కడ దొరుకుతోందో, ఎందుకు అంత తక్కువలో అమ్ముతున్నారు అన్నదానికి అసలు కారణం తెలుసుకుంటే, బీరు ప్రియులు నోరెళ్ల బెట్టాల్సిందే.


బీరు ప్రియులు ఎక్కువగా ఇష్టపడే కింగ్ ఫిషర్ బీర్ గురించి అసలు విషయం తెలుసుకుంటే ఔరా అనేస్తారు. కానీ దాని అసలు తయారీ ఖర్చు ఎంత, అసలు ధర ఎంత అనేది చాలా మందికి తెలియదు. నిజంగా చూస్తే, ఒక్క లీటరు బీర్ తయారీకి రూ. 30 నుండి రూ. 45 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇందులో మాల్ట్, హాప్స్, ఈస్ట్, నీటి ఖర్చులు, కార్మిక వ్యయం, ప్యాకేజింగ్ మొదలైనవి కూడా కలిపిన లెక్క ఇది. అటువంటి తయారీపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ డ్యూటీలు, లైసెన్స్ ఫీజులు, రిటైల్ మార్జిన్ వల్లే బీరు ధరలు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు.

అయితే ఇదే బీర్ కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా గోవా, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కువ ధరకు దొరుకుతుంది. ఉదాహరణకు గోవాలో 650 మిల్లీ లీటర్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ బాటిల్ ధర కేవలం రూ. 30 నుండి రూ. 50 మధ్యే ఉంటుంది. అక్కడ ఎక్సైజ్ డ్యూటీలు తక్కువగా ఉండటం, ప్రభుత్వ పాలనలో మద్యపాన పాలసీ సడలింపులు ఉండటంతోనే ఈ ధర సాధ్యమవుతుంది.


ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో, కొందరు టూరిస్టులు గోవాలో బీర్ బాటిల్లు రూ. 30కి కొనుగోలు చేసిన ఫుటేజీలను చూపించారు. ఇక్కడ నీళ్ల బాటిల్ కంటే బీరు చీప్‌గా ఉందనే కామెంట్లు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇదే విషయాన్ని పట్టుకుని కొంతమంది బీరు ప్రేమికులు అక్కడే వెళ్లి స్టాక్ తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: AP land pooling 2025: ఏపీ ప్రభుత్వం భారీ స్కెచ్..! అమరావతిలో నిర్మాణాలకు ఏకంగా అన్ని వేల ఎకరాలా?

ఇంకొంతమంది వ్యాపారులు మాత్రం ఇదే విషయాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. చీప్ ప్రైస్‌లో బీర్ లభిస్తున్న ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి, రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలించి అధిక ధరకు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం అయినప్పటికీ, కొందరు ఇలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ సమయంలో ప్రభుత్వాలు ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నా, ప్రజలకు మాత్రం అసలు విషయం తెలియక తప్పుడు లెక్కలే నమ్ముతున్నారు. బీరు ధర పై పెట్టుబడి కన్నా ఎక్కువగా పన్నులే ఉండటం వల్లే రూ. 30కి తయారైన బీర్ మార్కెట్లో రూ. 150కి అమ్మబడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మద్యపాన నియంత్రణ కఠినంగా ఉండటంతో, ఇక్కడ కింగ్ ఫిషర్ బీర్ ధర రూ.130 నుండి రూ.180 వరకు ఉంటుంది. అయితే అదే కంపెనీ ఉత్పత్తి అయిన బాటిల్ గోవాలో మాత్రం రూ. 30కు దొరుకుతుందంటే ఆశ్చర్యం కాక మానదు.

బీర్ అంటే ఖరీదైన పానీయం అని భావించే వారి కోసం ఈ విషయం ఒక నిజం గుణపాఠం లాంటిది. తయారీకి పెద్దగా ఖర్చు లేకపోయినా ప్రభుత్వ పన్నుల వల్లే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇకపై బీరు కొనేటప్పుడు అసలు ఖర్చు ఎంత, నిజమైన విలువ ఎంత అన్న దానిపై తెలుసుకొని వ్యవహరించాలి. రాష్ట్రానికి రాష్ట్రానికి బీర్ ధరలో ఉన్న తేడాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

Related News

Why Not Pulivendula: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

Big Stories

×