E-Paper
Advertisement

Double Century Records : వన్డేల్లో డబుల్ సెంచరీ రికార్డులు ఇవే..

Double Century Records : వన్డేల్లో డబుల్ సెంచరీ రికార్డులు ఇవే..
Advertisement

Double Century Records: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు… టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా… ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదేశాడు. అతని ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు, 24 ఫోర్లు ఉన్నాయంటే… ఏ రేంజ్ లో చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు… కెరీర్లో పదో వన్డేలోనే డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు… ఇషాన్ కిషన్.

అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు మొత్తం 9 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఈ ఘనత సాధించిన అంతర్జాతీయ క్రికెటర్లలో ఇషాన్ కిషన్ 7వ బ్యాటర్. టీమిండియా క్రికెటర్లలో మాత్రం నాలుగోవాడు. ఇంతకు ముందు సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు బాదారు. ఈ ముగ్గురిలో హిట్ మ్యాచ్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు(264, 209, 208) కొట్టడం విశేషం. తాజాగా ఇషాన్ కిషన్ చేసిన డబుల్ సెంచరీతో… వన్డేల్లో టీమిండియా తరఫున నమోదైన డబుల్ సెంచరీల సంఖ్య ఆరుకు చేరింది.

Advertisement

ఔట్ కాకుండా ఉంటే బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ కూడా చేసేవాడినని చెప్పాడు… ఇషాన్ కిషన్. మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే తాను ఔటయ్యానని… ఔట్ కాకపోతే కచ్చితంగా ట్రిపుల్ సెంచరీ చేసి… వన్డేల్లో ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచేవాడినని చెప్పాడు… ఇషాన్ కిషన్. వన్డేల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు కాస్త అసంతృప్తిగా ఉందన్నాడు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×