E-Paper
Advertisement

T20 : వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరుకునే జట్లు ఇవే… సచిన్ జోస్యం!

T20 : వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరుకునే జట్లు ఇవే… సచిన్ జోస్యం!
Advertisement

T20 : టీ-20 వరల్డ్ కప్ లో సూపర్-12 మ్యాచ్ ల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హేమాహేమీ జట్ల మధ్య జరిగే హై-ఓల్టేజ్ ఫైట్ లు చూసేలా… తమ రోజు వారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, భారత్, పాక్ లాంటి ఆరు మేటి జట్లలో… ఈసారి నాలుగు జట్లు సెమీస్ చేరతాయంటున్నాడు… మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఇవే అంటూ ఓ జాబితా రిలీజ్ చేశాడు. అందులో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఉన్నాయి. వీటిలో ఏ జట్లు సెమీస్ చేరినా… విజేతగా మాత్రం భారతే నిలవాలని కోరుకుంటున్నానన్నాడు… సచిన్.

భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు న్యూజిలాండ్, సౌతాఫ్రికా నుంచి గట్టి పోటీ ఎదురు కావొచ్చని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. కానీ… ఛాంపియన్ గా నిలిచే అవకాశాలు భారత జట్టుకే ఎక్కువగా ఉన్నాయని… మెన్ ఇన్ బ్లూ తన అంచనాల్ని నిజం చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు. బుమ్రా లాంటి మేటి బౌలర్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే అన్న సచిన్… అతని స్థానంలో షమీ రావడం సంతోషించదగ్గ పరిణామం అని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని… అదే స్థాయి ప్రతిభను అన్ని మ్యాచ్ ల్లోనూ షమి చూపాలని ఆశిస్తున్నట్లు సచిన్ చెప్పాడు. సచిన్ జోస్యం ఏ మేరకు నిజం అవుతుందో తెలియాలంటే… నవంబర్ ఆరు దాకా ఆగాల్సిందే. ఎందుకంటే… వచ్చే 15 రోజులు సూపర్ -12 మ్యాచ్ లే ఉన్నాయి మరి. ఆ తర్వాతే సెమీఫైనల్ చేరే జట్లేవో తేలిపోతుంది.

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×