GT VS SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఏకంగా 82 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ అందుకుంది. చేజింగ్ చేసే క్రమంలో 86 పరుగులకు సన్ రైజర్స్ హైదరాబాద్ కుప్పకూలింది. దీంతో చావు దెబ్బ తిన్న హైదరాబాద్ జట్టుపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఫ్లాట్, హోమ్ గ్రౌండ్ లో మాత్రమే సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు బాగా ఆడతారని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇక ఈ మ్యాచ్ జరుగుతుండగా తెలుగు కామెంటేటర్, మాజీ క్రికెటర్ NC కౌశిక్ ( Telugu Cricket Commentator NC Kaushik) సన్రైజర్స్ హైదరాబాద్ పరువు తీశాడు. గుజరాత్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతుందని తేలిపోగానే.. ఓ కామెంట్ చేశాడు. మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడలేదు… అహ్మదాబాద్ వెళ్లలేదు… సాయిబాబా గుడికి వెళ్లి హైదరాబాద్ ప్లేయర్లు భజన చేశారని ఫ్యాన్స్ అనుకోవాలని దారుణంగా ఆడుకున్నారు. ఇంకా రెండు మ్యాచ్ లు హైదరాబాద్ కు ఉన్నాయి.. అందులో ఒకటి గెలవాలని SRH అభిమానులు అనుకోవాలంటూ దారుణంగా పరువు తీశారు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ జరగలేదు అన్నట్లుగా దాన్ని ఒక పీడకలగా భావించి, మర్చిపోవాల్సిందేనని సెటైర్లు పేల్చారు. దీంతో NC కౌశిక్ చేసిన కామెంట్రీ వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ తేలిపోయింది. 14.5 ఓవర్లు ఆడిన హైదరాబాద్.. 86 పరుగుల వద్ద కుప్ప కూలింది. దీంతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి గుజరాత్ టైటాన్స్ చేరుకుంది. అంటే దాదాపుగా గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరినట్లేనని చెప్పవచ్చు. మరో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా వెళ్లనుంది. ఇటు హైదరాబాద్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
?igsh=a2dleDlmcnBjaTVi