KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… జరుగుతున్న మ్యాచ్లన్నీ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 24 మ్యాచులు ఈ టోర్నమెంట్లో పూర్తయ్యాయి. అయితే నిన్న అంటే గురువారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైన అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఏకంగా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్.
Also Read: Shubman Gill: సవాల్ కి సిద్ధం.. అపోజిషన్ టీమ్స్ కి గిల్ మాస్ వార్నింగ్
దుమ్ములేపిన కేఎల్ రాహుల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. ప్రతి మ్యాచ్ లోను దుమ్ము లేపుతున్న కే ఎల్ రాహుల్… నిన్న కూడా 93 పరుగులు చేశాడు. కేవలం 53 బంతుల్లోనే 93 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఏకంగా ఆరు సిక్సులు బాదాడు. ఇందులో 7 బౌండరీలు ఉన్నాయి. 175 స్ట్రైక్ రేటుతో రఫ్ ఆడించాడు కేఎల్ రాహుల్. చివరి వరకు పోరాటం చేసిన కేఎల్ రాహుల్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు.
గ్రౌండ్ పై బ్యాట్ తో కొట్టిన రాహుల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కేఎల్ రాహుల్… తన బ్యాట్ తో… గ్రౌండ్ పైన బాదాడు. ఇది నా అడ్డ… అంటూ సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశాడు కేఎల్ రాహుల్. వాస్తవానికి కేఎల్ రాహుల్… బెంగళూరుకు చెందిన వాడు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అందుకే అలా బ్యాడ్ తో గ్రౌండ్ను బాదాడు కేఎల్ రాహుల్. అలాగే తన ఫెయిల్యూర్ కారణంగా… లక్నో ఓనర్ సంజీవ్… చేసిన పనికి కూడా కౌంటర్ ఇచ్చేలా కేఎల్ రాహుల్ ఇలా చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైన ఢిల్లీ క్యాపిటల్స్ విజయం కంటే కేఎల్ రాహుల్ చేసిన పని వైరల్ గా మారింది.
Also Read: Khali: ఏంట్రా ఖలీకి ఏమైంది… ఇలా చెట్లు నరుకుతున్నాడు!
ఇది ఇలా ఉండగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ టీం.. తక్కువ పరుగులే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 163 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అవలీలగా ఆ లక్ష్యాన్ని చేదించగలిగింది. 17.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 169 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన కే ఎల్ రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">