E-Paper
Advertisement

Tilak Varma Century: తిల‌క్ వ‌ర్మ భీక‌ర సెంచ‌రీ..హార్దిక్ పాండ్యా ఓవ‌రాక్ష‌న్ చూడండి

Tilak Varma Century: తిల‌క్ వ‌ర్మ భీక‌ర సెంచ‌రీ..హార్దిక్ పాండ్యా ఓవ‌రాక్ష‌న్ చూడండి
Advertisement

Tilak Varma Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  నేపథ్యంలో ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans vs Mumbai Indians) మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ నిర్నిత 20 ఓవర్లలో 199 పరుగులు సాధించింది ముంబై ఇండియన్స్. ముఖ్యంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma Century) 45 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 224 స్ట్రైక్ గ్రేడ్ తో ఇరగదీసాడు. ఈ త‌రుణంలో తిల‌క్ వ‌ర్మ ఇన్నింగ్స్ వైర‌ల్ గా మారింది.

Also Read: Blessing Muzarabani: న‌ఖ్వీకి చిప్పు దొబ్బిందా ? బ్యాన్ లేదు బొంగు లేదు, PSL కాలి గోటితో సమానం

తిల‌క్ వ‌ర్మ భీక‌ర సెంచ‌రీ..హార్దిక్ పాండ్యా ఓవ‌రాక్ష‌న్ చూడండి

Advertisement

ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇవాళ 30వ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన ముంబై ఇండియన్స్, ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. మొదట్లో ముంబై ఇండియన్స్ తరబడినప్పటికీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. కాస్త స్లోగా స్టార్ట్ చేసి, ఆ తర్వాత విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే చివరి బంతి వరకు ఆడిన తిలక్ వర్మ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. 45 బాల్స్ లో 101 పరుగులు సాధించాడు తిలక్.

ఇందులో 7 సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా చేసిన ఓవరాక్షన్ వైరల్ గా మారింది. అతడు 16 బంతుల్లో 15 పరుగులు చేసినప్పటికీ.. తిలక్ వర్మకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మరో ఎండువైపు ఉన్న హార్దిక్ పాండ్యా, ఇలా కొట్టు.. అలా కొట్టు అంటూ మ్యాచ్ జరుగుతుండగానే ట్రైనింగ్ ఇచ్చాడు. గట్టి మోటివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద అరుపులతో రెచ్చిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు… హార్దిక్ పాండ్యాను ట్రోలింగ్ చేస్తున్నారు. వీడికి చేతకాదు కానీ… ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

ఒకే ఓవర్ లో 26 పరుగులు సాధించిన తిలక్ వర్మ

Advertisement

150 స్పీడ్ తో బౌలింగ్ చేసే గుజరాత్ బౌలర్ అశోక్ శర్మకు ( Ashok sharma) తిలక్ వర్మ చుక్కలు చూపించాడు. అశోక్ శర్మ వేసిన 18వ ఓవర్ లో ఏకంగా 26 పరుగులు సాధించాడు తిలక్. 6,4,4,6,6 వరుసగా బాదేశాడు. అయితే చివరి బంతికి తిలక్ వర్మకు గాయం అయింది. గతంలో ఆపరేషన్ జరిగిన చోట బంతి తగిలింది. ఈ క్రమంలోనే గ్రౌండ్ లో పడి విలవిలా కొట్టుకున్నాడు. ఆ తర్వాత సెంచరీ నమోదు చేసుకున్నాడు.

 

 

 

 

 

 

 

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×