Tilak Varma – SKY: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 22 వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో… ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లోని ఆడే పది జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. 10 టీమ్ లు రెండు జట్లుగా విడిపోయి… మరీ.. ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఈ తరుణంలోనే….. ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) కూడా రెండుగా చీలి ప్రాక్టీస్ చేస్తోంది.
Also Read: SRH Players: కూకట్ పల్లి క్లాసెన్, జూపార్క్ జంపా…SRH ప్లేయర్ల పేర్లు అదరహో !
అయితే.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ డేంజర్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav) వికెట్ తీశాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma). లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే ఈ హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ… అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేస్తాడు. ఈ తరుణంలోనే.. ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌలింగ్ చేశాడు. తన స్పిన్ బౌలింగ్ లో ముంబై ఇండియన్స్ డేంజర్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ వికెట్ తీశాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ వికెట్ తీసిన తర్వాత… టేక్ ఏ బౌ అన్నట్లుగా సూర్య దగ్గరకు వెళ్లి రచ్చ చేశాడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తిల్ వర్మ వేసిన బంతి వంగి మరీ.. లెగ్ సైడ్ బ్యాటింగ్ చేశాడు సూర్య. అయితే.. అక్కడ ఉన్న ఫీల్డర్ సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ వెనుదిరగాల్సి వచ్చింది.
ఇది ఇలా ఉండగా…. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అయ్యాడు. కాసేపటి క్రితమే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ను నియామకం చేసింది ముంబై యాజమాన్యం. ఐపీఎల్ 2025లో ముంబై ఆడబోయే మొదటి మ్యాచ్‌కి కెప్టెన్‌గా సూర్య కుమార్ యాద్ కొనసాగనున్నాడు. మొదటి మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్‌లకు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ సీజన్ మొదటి మ్యాచ్‌కి దూరం కానున్నాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మొదటి మ్యాచ్ మార్చి 23వ తేదీన ఉంటుంది. అయితే… చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మొదటి మ్యాచ్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉంటాడన్న మాట.
Also Read: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు..కేకేఆర్ వర్సెస్ లక్నో మ్యాచ్ రద్దు ?
Tilak Varma dismissed Suryakumar Yadav in the practice match. 😂pic.twitter.com/9xRD9s8I6l
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2025