Big Stories

Pat Cummins on SRH Vs LSG: నేను నమ్మలేకపోతున్నాను.. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్!

Pat Cummins Comments on SRH Win Against LSG: హైదరాబాద్ సన్ రైజర్స్ దుంప కొట్టుడికి 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి రికార్డ్ బ్రేక్ విజయం సాధించిన తీరుకి ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ నిజంగా నేను నమ్మలేకపోతున్నానని అన్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ తమ ఆటతో పిచ్ స్వరూపాన్నే మార్చేశారని అన్నాడు. నిజానికి సెకండాఫ్ లో పిచ్ మారుతుందని అనుకున్నామని, కానీ ఇంత ఇదిగా పండులా బ్యాట్ మీదకి బాల్ వస్తుందని ఊహించలేదని అన్నాడు.

ట్రావిస్ హెడ్, అభిషేక్ ఇద్దరిని స్వేచ్ఛగా ఆడమనే చెబుతున్నామని, మొదటి నుంచి ఇదే పాలసీలో వెళ్లామని తెలిపాడు. వాళ్లిద్దరూ అవుట్ అయ్యాక తర్వాత వచ్చినవారు చూసుకుంటారని అనుకున్నాం తప్ప, వారూ అవుట్ అయినా అడ్డుచెప్పలేదని అన్నాడు. వారిద్దరి మధ్య ఎంతో పాజిటివ్ ద్రక్పథం ఉంది. వారిద్దరికి ఎలా  ఆడాలో, ఎలా ఆడకూడదో ఒక బౌలర్ గా నేను సలహాలు ఇవ్వలేనని అన్నాడు.

- Advertisement -

ట్రావిస్ హెడ్ గత రెండేళ్లుగా చాలా కష్టసాధ్యమైన పిచ్ లపై బాగా ఆడుతున్నాడు. ఇది సాధారణ విషయం కాదని అన్నాడు. అలాగే అభిషేక్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడని అన్నాడు. పవర్ ప్లే లో వీళ్లిద్దరినీ ఎదుర్కోవడం అంత ఆషామాషీ విషయం కాదని అన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లకి ఇది మాత్రం అద్భుతమైన సీజన్, వారికే కాదు క్రికెట్ అభిమానులు అందరికీ గుర్తుండి పోతుందని అన్నాడు. మళ్లీ ఇలాంటి కనువిందైన ఆటను చూడలేమని కూడా అన్నాడు. చూసిన వాళ్లదే అదృష్టమని కూడా తెలిపాడు.

- Advertisement -

Also Read: బౌలర్లను కాపాడండి.. సీనియర్ల ఆందోళన

అనంతరం ఓపెనర్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ ఇలా ఆడేందుకు నా జీవితంలో ముగ్గురున్నారని అన్నాడు. ఒకరు క్రికెట్ లో ఓనమాలు నేర్పిన నాన్న అయితే, తర్వాత యువరాజ్ సింగ్, ఆ తర్వాత బ్రయాన్ లారా అని తెలిపాడు. ఈ రోజు నా ఆట ఇలా ఉందంటే వీరి ముగ్గురే కారణమని, వాళ్లకి జీవితాంతం క్రతజ్నతగా ఉంటానని అన్నాడు.

తర్వాత ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ అభిషేక్ తో నా కాంబినేషన్ కుదిరిందని అన్నాడు. రన్స్ తీసేటప్పుడు, బ్యాటింగ్ చేసేటప్పుడు ఇద్దరి ఆటిట్యూడ్ ఒకేలా ఉందని అన్నాడు. అదే మా విజయ రహస్యమని తెలిపాడు. అభిషేక్ ని అభినందించాడు.

మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్ కి మాత్రం పీడకలగా మ్యాచ్ మిగిలిపోయింది.. తర్వాత మ్యాచ్ ల్లో మరింత జాగ్రత్తగా ఆడి ముందుకు వెళతామని కెప్టెన్ రాహుల్ తెలిపాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News