BigTV English

Top 3 Matches :- స్కోర్ తక్కువైనా గెలవడం బెంగళూరు అలవాటే…

Top 3 Matches :- స్కోర్ తక్కువైనా గెలవడం బెంగళూరు అలవాటే…

Top – 3 Matches :- బెంగళూరు జట్టు కేవలం 127 పరుగులు మాత్రమే చేసినా 18 పరుగుల తేడాతో గెలిచింది. వాట్ ఏ మ్యాజిక్ కదా. ఐపీఎల్‌లో ఇలాంటి మ్యాజిక్ గేమ్స్‌కు కొదవలేదు. ఐపీఎల్‌లో 200 పైన స్కోర్లు కొట్టడం గొప్ప కాదు. 100, 120 కొట్టినా గెలవడం గొప్ప. అలాంటి అద్భుతాలు చాలా జరిగాయి. మొన్న లక్నో సూపర్ జెయింట్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించడంతో… గతంలో ఇలాంటి ఫీట్స్ సాధించిన మ్యాచ్‌లను మరోసారి గుర్తు చేస్తున్నారు అభిమానులు. తక్కువ స్కోర్ చేసినా… బెంగళూరు జట్టు మ్యాచ్‌లను నిలబెట్టుకున్నాయని కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు…


1. రాజస్తాన్‌పై గెలుపు
2009, ఏప్రిల్ 18వ తేదీన బెంగళూరుతో తలపడింది రాజస్తాన్ జట్టు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కేవలం 138 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్ ద్రవిడ్, కెవిన్ పీటర్సన్ 68 పరుగుల పార్ట్‌నర్‌షిప్ కారణంగా.. ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. ఇక బెంగళూరు జట్టు మ్యాచ్ ఓడిపోవడమే అనుకున్నారంత. కాని, బౌలింగ్‌తో అద్భుతమే చేసింది బెంగళూరు జట్టు. 58 పరుగులకే రాజస్తాన్ ఆల్‌ఔట్ అయింది. ఆ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే శివాలెత్తాడు. 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

2.చెన్నైపై గెలుపు
2008, మే 21న చెన్నై సూపర్ కింగ్స్‌పై సెన్సేషనల్ విన్నింగ్ క్రియేట్ చేసింది బెంగళూరు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. అప్పుడు కూడా రాహుల్ ద్రవిడ్ 47 పరుగులు చేసి మ్యాచ్‌ను నిలబెట్టాడు. ఇక ఛేజింగ్‌కు దిగిన చెన్నై జట్టు మొదట్లో బాగానే ఆడింది. ఓపెనర్లు 60 పరుగులు చేశారు. ఇక చెన్నై గెలుపు ఖాయం అనుకున్న సమయానికి మరోసారి అనిల్ కుంబ్లే విజృంభించాడు. 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 84/2 ఉన్న చెన్నై… ఆ తరువాత 109/8కి చేరింది. ఫైనల్‌గా 112 పరుగులు మాత్రమే చేసి బెంగళూరుపై ఓడిపోయింది.


3.లక్నోపై గెలుపు
మొన్న మే 1వ తేదీన కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేసింది బెంగళూరు జట్టు. 126 పరుగులకే చాప చుట్టేశారు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్‌మెన్. కొహ్లీ 31, డూప్లెసిస్ 44 పరుగుల కారణంగా ఆ మాత్రమైనా స్కోర్ వచ్చింది. ఇక ఛేజింగ్‌కు దిగిన లక్నో.. కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×