Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో ( Champions Trophy 2025 ) భాగంగా తాజాగా మరో కీలక అప్డేట్ రావడం జరిగింది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… రంగంలోకి ఐసీసీ దిగింది. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ దేశంలో ఈ ట్రోఫీ జరగాల్సి ఉండేది. కానీ భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్ దేశానికి వెళ్ళేది లేదని టీమిండియా ఇప్పటికే ప్రకటించింది. అయితే టీమిండియా… పాకిస్తాన్ వెళ్లకపోతే ఈ ట్రోఫీ పెట్టి కూడా… లాభం ఉండదు. కాబట్టి టీమిండియా వచ్చేలా ప్లాన్ చేస్తోంది ఐసిసి. దీనికోసం హైబ్రిడ్ మోడల్ ను ఎంచుకుంది. దక్షిణాఫ్రికాలో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని ఐసీసీ అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట.
Also Read: Cheteshwar Pujara: టీమిండియాకు గుడ్ న్యూస్..ఆసీస్ కు చతేశ్వర్ పుజారా!
ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సమాచారం కూడా ఇచ్చారట. కానీ పాకిస్తాన్లో నిర్వహించాలని పిసిబి బోర్డు… ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇకపై.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు గురించి కామెంట్ చేయకూడదని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిందట. హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పిందట ఐసీసీ. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపైన ఈ టోర్నమెంట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.