BigTV English

Toyota -Team India : టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఎవరంటే?

Toyota -Team India : టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఎవరంటే?

Toyota -Team India :  ప్రమోషన్ బిల్లు రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తమ జట్లకు జెర్సీ స్పాన్సర్ గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11తో ఒప్పందాన్ని ఉన్నపళంగా రద్దు చేసుకుంది. దీంతో ప్రస్తుతానికి భారత క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారిక స్పాన్సర్ లేకుండా పోయారు. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ లో కూడా టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగవచ్చు. ఈలోపు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికితే వారి లోగోతో ఉన్న జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగుతారు. డ్రీమ్ 11 స్థానంలో టీమిండియా జెర్సీని స్పాన్సర్ చేసేందుకు టొయోటా మోటార్ కార్పొరేషన్ ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read : RJ Mahvash : శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు ప్రాణం.. చాహల్ కు షాక్ ఇచ్చిన RJ మహ్వాష్

టొయోటాతో ఒప్పందం.. 


మరోవైపు టొయోటాతో పాటు ఓ ఫిన్ టెక్ స్టార్టప్, టాటా గ్రూప్, రిలియన్స్, అదానీ గ్రూప్ వంటి సంస్థలు కూడా బీసీసీఐకి తమ ఆసక్తిని తెలిపాయని సమాచారం. జెర్సీ స్పాన్సర్ షిప్ ను అధికారిక టెండర్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. బీసీసీఐ త్వరలో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించింది. ఇక 2023లో రూ.358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్ -టెక్ దిగ్గజం బైజూస్ స్థానాన్ని డ్రీమ్ 11 భర్తీ చేసింది. తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయంతో  డ్రీమ్ 11 బీసీసీఐ అగ్రిమెంట్ మధ్యలోనే రద్దు అయింది. మరోవైపు సోషల్ మీడియాలో విమల్ పాన్ మసాలా ఫొటోలు కూడా దర్శనమివ్వడంతో అసలు ఇంతకు టీమిండియా స్పాన్సర్ షిప్ ఉందా..? లేదా..?  అనే కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్.. 

విమల్ పాన్ మసాలా టీమిండియా కి 2028 వరకు స్పాన్సర్ వ్యవహరించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడం విశేషం. మరోవైపు డ్రీమ్ 11తో స్పాన్సర్ షిప్ ఒప్పందం రద్దు చేసుకున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.”ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ చట్టం అమలులోకి వచ్చాక డ్రీమ్ 11తో ఒప్పందం రద్దు చేసుకున్నాం. ఇకపై భవిష్యత్ లో అలాంటి సంస్థలతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందాలు చేసుకోదు” అని స్పష్టం చేశారు. దీంతో ఆసియా కప్ లో టీమిండియా మెయిన్ స్పాన్సర్ లేకుండానే ఆడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తరుణంలోనే విమల్ పాన్ మసాలా టీమిండియా కి స్పాన్సర్ గా వ్యవహరించనున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించడం విశేషం.మరోవైపు ఆసియా కప్ ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు ఆటగాళ్లు ఎలాంటి జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.

Related News

Ganesh Idol : RCB ట్రోఫీతో బొజ్జ గణేష్… మళ్లీ తొక్కి సలాట జరగడం గ్యారంటీ అంటూ ట్రోలింగ్ !

RJ Mahvash : శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు ప్రాణం.. చాహల్ కు షాక్ ఇచ్చిన RJ మహ్వాష్

Cricketers : క్రికెటర్లు చేతి వేళ్లకు టేప్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక రహస్యం ఏంటి

Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

Harshit Rana : గంభీర్ ఎంతకు తెగించాడు రా.. ఏకంగా హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ?

Big Stories

×