E-Paper
Advertisement

U-19 World Cup Final: వైభ‌వ్ 175 ప‌రుగులు, ఫైన‌ల్స్ లో 400 దాటిన టీమిండియా స్కోర్‌..ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే

U-19 World Cup Final: వైభ‌వ్ 175 ప‌రుగులు, ఫైన‌ల్స్ లో 400 దాటిన టీమిండియా స్కోర్‌..ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే
Advertisement

U-19 World Cup Final:  అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026) ఫైనల్స్ ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అండర్ 19 అలాగే టీమ్ ఇండియా అండర్ 19 జట్లు ( England U19 vs India U19, Final) తలపడుతున్నాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ( Harare Sports Club, Harare) ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా అండర్ 19 జట్టు భారీ స్కోరు సాధించింది. వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi ) 175 పరుగులతో రెచ్చిపోగా, కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలోనే 50 ఓవ‌ర్లు ఆడిన టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టు, 9 వికెట్లు కోల్పోయింది. ఏకంగా 411 ప‌రుగులు సాధించింది. అంటే ఈ మ్యాచ్ లో 412 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సాధిస్తే, ఇంగ్లాండ్ గెలుస్తుంది.

Also Read: Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

400 పరుగులు సాధించిన టీమిండియా

Advertisement

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ( England U19 vs India U19, Final) మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎవరు ఊహించని రీతిలో బ్యాటింగ్ చేసింది. వైభవ్ సూర్య వంశీ మరోసారి విజృంభించి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 80 బంతుల్లో 175 పరుగులతో చుక్కలు చూపించాడు. ఇందులో 15 బౌండరీలు అలాగే 15 సిక్సర్లు ఉన్నాయి. ఏకంగా 218.75 స్ట్రైక్ రేటుతో ఇరగదీశాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే ( Ayush Mhatre) కూడా తన సాయం చేశాడు. ఈ మ్యాచ్ లో 51 బంతులు ఎదుర్కొన్న ఆయుష్ 53 పరుగులు సాధించాడు. అభిగ్యాన్ కుందు 40 పరుగులతో రఫ్ఫాడించాడు. చివ‌ర‌లో వ‌చ్చిన‌ కనిష్క్ చౌహాన్ 20 బంతులు ఆడి, 37 ప‌రుగులు సాధించాడు. ఇందులో 3 బౌండ‌రీలు, ఒక సిక్స‌ర్ ఉంది.  దీంతో నిర్ణీత‌ 50 ఓవర్లు ఆడిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు సాధించింది.

ఫైన‌ల్స్ లో వైభ‌వ్, టీమిండియా స‌రికొత్త రికార్డులు

అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో అరుదైన రికార్డులను నమోదు అయ్యాయి. ఫైనల్ మ్యాచ్ లో ఓ జ‌ట్టు 411 పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఈ లిస్టులో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే ఈ వన్డే వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెకండ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా వైభవ్ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు అండర్ 19 వన్డే వరల్డ్ కప్ లో ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా కూడా చరిత్ర సృష్టించాడు. అటు ఫైనల్స్ లో ఇండియా తరఫున సెంచరీ చేసిన మూడవ ఆటగాడిగా కూడా వైభవ్ రికార్డులోకి ఎక్కడ జరిగింది. వన్ అవర్ వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ 150 పరుగులు చేసిన ప్లేయర్ గా కూడా వైభవ్ చరిత్ర సృష్టించాడు. అటు అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది టీమిండియా.

Advertisement

Also Read: Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×