Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ స్టార్ బౌలర్. ఎన్నోసార్లు మ్యాచ్ భారత్ చేజారిపోతుందనే సమయంలో బంతి అందుకుని మలుపు తిప్పే స్టార్ బౌలర్ బుమ్రా. అలాంటి బూమ్రా.. కెరీర్ ప్రారంభంలో పడ్డ ఇబ్బందుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
Also Read: Pakistan Cricket: జింబాబ్వే కంటే పాక్ దారుణం.. కొత్త ప్లేయర్లు వచ్చినా.. తలరాత మారలేదు !
వివరాల్లోకి వెళ్తే.. బుమ్రా {Jasprit Bumrah} పంజాబీ కుటుంబానికి చెందిన జస్వీర్ సింగ్ – దల్జీత్ కౌర్ దంపతుల కుమారుడు. అయితే బుమ్రాకి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు. ఆ సమయంలో మనవడికి, కోడలికి అండగా ఉండాల్సిన బుమ్రా తాత సంతోక్ సింగ్ వీరిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇలా కొడుకు చిన్నతనంలోనే భర్త మరణించడం, మామ పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లిపోవడంతో బుమ్రా తల్లి ఒంటరైంది.
ఆ సమయంలో తన కొడుకును గొప్పవాడిని చేయాలని ఎన్నో కలలు కని.. అప్పటికే ఓ పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఆమె బుమ్రా కోసం ఎంతగానో కష్టపడింది. తన కుమారుడికి క్రికెట్ పై ఉన్న ఇష్టాన్ని గ్రహించింది. ఆ వైపుగా ప్రోత్సహించింది. భర్త అండ లేకపోయినా, అత్తింటి వారి సహకారం లేకపోయినా.. కొడుకుని ఓ గొప్ప క్రికెటర్ గా తయారు చేయాలని భావించింది. ఎంతో కష్టపడి టీమ్ ఇండియాకి ఓ వజ్రాయుదాన్ని అందించింది.
ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్, పలు ఐపీఎల్ వాణిజ్య ఒప్పందాలతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు బుమ్రా. కానీ కెరీర్ ప్రారంభంలో అతడికి సరైన బట్టలు, షూలు కూడా ఉండేవి కావట. ఈ విషయాల గురించి బుమ్రా, అతడి తల్లి తెలిపిన ఓ వీడియోని 2019లోనే ముంబై ఇండియన్స్ ట్విట్టర్ లో తెలిపింది. ఆ వీడియోలో తాను వేసుకున్న బట్టలను మళ్లీ మళ్లీ ఉతుక్కొని వేసుకునే వాడినని తెలిపాడు బుమ్రా.
Also Read: WPL 2025 : దరిద్రం అంటే వీళ్లదే…. మూడు సార్లు ఫైనల్స్ ఓడిపోయారు !
ఇక అతడి తల్లి మాట్లాడుతూ.. “మొదటిసారి బుమ్ర ఐపీఎల్ ఆడుతున్నప్పుడు టీవీలో చూశాను. ఆ సమయంలో ఏడవకుండా ఉండలేకపోయాను. శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ బుమ్రా ఎంతగానో కష్టపడ్డాడు. ఒకసారి షాప్ లో ఖరీదైన షూ చూసి.. ఎప్పటికైనా వాటిని కొంటానని అన్నాడు. కానీ ఇప్పుడు బుమ్రా దగ్గర ఎన్నో రకాల షూస్ ఉన్నాయి” అని చెబుతూ భావోద్వేగానికి గురైంది. ఇక 2013లో ఐపిఎల్ లోకి అరంగేట్రం చేశాడు బుమ్రా. తన కెరీర్ లో ఇప్పటివరకు 45 టెస్ట్ లు ఆడిన బుమ్రా.. 205 వికెట్లు పడగొట్టాడు. ఇక 89 వన్డేల్లో 149, 70 టీ-20 లో 89 వికెట్లు తీశాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">