BigTV English

IPL 2026 : CSK సంచలన నిర్ణయం..10 స్టార్ ప్లేయర్లను వదిలేయాలని ధోని ఆదేశాలు ?

IPL 2026 : CSK సంచలన నిర్ణయం..10 స్టార్ ప్లేయర్లను వదిలేయాలని ధోని ఆదేశాలు ?

IPL 2026 : సాధారణంగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్ అని ప్రతీ అభిమానికి తెలిసిందే. ధోనీ కెప్టెన్సీలో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్  కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయాలబారిన పడి దూరం కావడంతో మళ్లీ ధోనీ పగ్గాలు చేపట్టాడు. కానీ ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానంలో నిలిచింది. ధోనీ కెప్టెన్సీలో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ నేపథ్యంలోనే ధోనీ 10 మంది స్టార్ ప్లేయర్లను వదిలేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. వారిలో ప్రధానంగా రవిచంద్రన్ అశ్విన్, కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, సామ్ కర్రన్, G సింగ్, N ఎల్లిస్, దీపక్ హుడా, ఓవర్టన్, విజయ్ శంకర్ ఈ 10 మంది ఆటగాళ్లను వదిలేయాలని సూచించినట్టు సమాచారం.


Also Read : Rishabh Pant : గిల్ ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేసిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

ఆ 10 మంది ఆటగాళ్లు వీరే..


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో 10 మంది ఆటగాళ్లను వదిలేయాలని ఆదేశాలు ఇచ్చిన సమయంలోనే ఇప్పుడు ధోనీ గురించి మరో వార్త కూడా వైరల్ అవుతోంది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనను జట్టు నుంచి తప్పించాడని నిన్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోనీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్ లో క్లిష్టమైన పరిస్థితిలో 27 బంతుల్లోనే 60 పరుగులు చేయాల్సిన సమయంలో తన సోదరుడు యూసూఫ్ పఠాన్ తో కలిసి  జట్టును గెలిపించాం.  ఆ పరిస్థితుల్లో మరెవ్వరైనా కెప్టెన్ ఉంటే.. జట్టులో ఏడాది పాటు ఉండేవాళ్లు. కానీ తరువాత సిరీస్ కే ధోనీ పక్కన పెట్టారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ లకు బెంచ్ కి పరిమితం చేయగా.. నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఐదో మ్యాచ్ లో కూడా బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చిందని తెలిపారు ఇర్ఫాన్ పఠాన్.

శాంసన్ ప్లేస్ లో బదిలీ అయ్యేది వారేనా..? 

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను వదిలేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి రానున్నట్టు సమాచారం. అయితే సంజు శాంసన్ ట్రేడ్ కోసం ఆర్ఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంజూ శాంసన్ బదిలీ కోసం పలు ఫ్రాంచైజీలను రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలె నేరుగా సంప్రదిస్తున్నట్టు సమాచారం. సంజు శాంసన్ స్థానంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గ్వైక్వాడ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బదిలీ కోసం CSKకు ఆర్ఆర్ యజమాని మనోజ్ బదాలె ప్రతిపాదించాడు. మరో ఆల్ రౌండర్ శివమ్ దూబెను తీసుకోవడానికి బదాలె ఆసక్తి చూపించాడట. స్టార్ ఆటగాళ్లలో ఏ ఒక్కరినీ కూడ వదలుకునేందుకు సిద్ధంగా లేమని బదాలె కు సీఎస్కే యజమాని స్పష్టం చేసినట్టు సమాచారం.

Related News

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍‌కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీష‌న్లు

Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియాపై సూర్యవంశీ సూపర్ సెంచరీ… ఏకంగా 8 సిక్సర్లు

Tilak Verma : త‌మ్ముడు తిల‌క్‌…ఆంధ్ర వాడి దెబ్బ.. పాకిస్తాన్ వాడి అబ్బా… జై జగన్ అంటూ

Saeed Ajmal Cheque : పాక్ PM ఇచ్చిన చెక్కులు బౌన్స్..ఆ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

Ind vs SL: వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ… శ్రీలంక చిత్తు చిత్తు

PCB : భారత్ చేతిలో ఓటమి.. పాక్ ప్లేయర్లకు PCB శిక్ష

Big Stories

×