Rishabh Pant : టీమిండియా (Team India) క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. అలాగే అక్కడే గాయపడ్డాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ (Rishabh Pant) విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించిన క్రమంలో సంబురాలు జరుపుకుంటున్న వేళ.. రిషబ్ పంత్ శుబ్ మన్ గిల్ ప్రైవేట్ పార్ట్ ని టచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు రిషబ్ పంత్ “ఐ హేట్ దిస్ సో మచ్ ” అంటూ తన పాదం ఫోటోను షేర్ చేశాడు. మరోవైపు రిషబ్ పంత్ అభిమానులు మాత్రం త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read : Cricketers: ఇదెక్కడి స్టేడియం రా… మెట్లపైనే స్కోర్ బోర్డు వివరాలు.. ఎక్కడంటే
నీ ఆటను మళ్లీ చూడాలి పంత్..
“త్వరగా కోలుకొని రావాలి పంత్. మళ్లీ నీ ఆటను చూడాలని అనిపిస్తోంది” అని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరోవైపు రెస్ట్ మోడ్ లో ఉన్న రిషబ్ పంత్ చెఫ్ అవతారం ఎత్తాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ” నేను ఇప్పుడు చూసేందుకు చెఫ్ లా ఉన్నా.. మీకు పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. కాస్త నన్ను భరించండి. నేను వెజిటేరియన్ పిజ్జా చేయబోతున్నా. నేను ఎక్కువగా వెజిటేరియనే ఇస్టపడుతా. ఇక్కడ చాలా వేడిగా ఉంది. విరిగిన కాలంలో నేను చేయగలిగేది పిజ్జాలు కాల్చడమే నేనెప్పుడూ ఇంట్లో ఏమీ వండలేదు. కానీ ఇప్పుడు పిజ్జాలు తయారు చేస్తున్నా” అంటూ అందులో పేర్కొన్నాడు. మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రిషబ్ పంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అది విమర్శలకు దారి తీస్తోంది. అభిమానుల నుంచే వ్యతిరేకత వస్తోంది. తాను పోస్ట్ చేసే ఎక్స్ క్లూజివ్ వీడియోలు చూసేందుకు ప్రశ్నలు అడిగేందుకు సబ్ స్క్రిప్షన్ మోడల్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
పంత్ పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఇక అందుకోసం రూ.390 చెల్లించాల్సి ఉంటుందని పలు కథనాలు వెలువడ్డాయి. వీటిపై రిషబ్ పంత్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం రిషబ్ పంత్ చాలా విధాలుగా డబ్బులు సంపాదిస్తున్నాడు. క్రికెట్ కెరీర్, బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, వ్యాపారం, పెట్టుబడులతో బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు. ఓ నివేదిక ప్రకారం.. 2025 నాటికకి పంత్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లు ఐపీఎల్ 2025 వేలంలో లక్నో ఫ్రాంచైజీ పంత్ ను రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంత డబ్బు ఉండి కూడా ఇన్ స్ట్రా గ్రామ్ లో వేల కోసం ఈ కక్కుర్తి ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంత్ ను ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేయాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.