OTT Movie : సైన్స్-ఫిక్షన్ సినిమాలు కొత్త కొత్త స్టోరీలతో వస్తూనే ఉన్నాయి. ఈసినిమాలను చూస్తున్నప్పుడు మనం భూమి మీదే ఉన్నామా ? అనే సందేహం కలుగుతుంటుంది. ఎందుకంటే వీటిలో ఉండే విజువల్స్, గ్రాఫిక్స్ అలా ఉంటాయి మరి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఎడ్డీ అనే ఒక ఏలియన్ రోబో భూమిపైకి వచ్చి రచ్చ చేస్తుంది. ఈ సంఘటనలు హాస్యాస్పదంగా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
‘మీట్ డేవ్’ (Meet dave) ఒక ఆహ్లాదకరమైన సైన్స్-ఫిక్షన్ కామెడీ చిత్రం. బ్రియాన్ రాబిన్స్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ఎడ్డీ మర్ఫీ, ఎలిజబెత్ బ్యాంక్స్, గాబ్రియెల్ యూనియన్, స్కాట్ కాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 90 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.1/10 రేటింగ్ ను పొందింది. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది
స్టోరీలోకి వెళ్తే
ఈ కథ రోబోట్ రూపంలో ఉన్న డేవ్ చుట్టూ తిరుగుతుంది. డేవ్ అనేది వాస్తవానికి ఒక మానవ రూపంలోని రోబోట్. దీనిని ఏలియన్స్ బృందం నియంత్రిస్తుంటుంది. నిల్మా అనే వాళ్ళు నివసించే గ్రహం, నీటి సంక్షోభంతో బాధపడుతుంటుంది. దీనిని అరికట్టడానికి వాళ్ళ ముందున్న ఏకైక మార్గం, భూమిపై ఉన్న ఒక శక్తివంతమైన ఆర్బ్‌ను సేకరించడం. ఈ ఆర్బ్ భూమి, సముద్రాలను సృష్టించగలదు. నిల్మాకు కావాల్సిన నీటిని కూడా అందించగలదు. ఈ మిషన్ లో భాగంగా డేవ్ అనే రోబోట్ ను భూమిపైకి పంపుతారు. డేవ్ కెప్టెన్ నాయకత్వంలో, ఈ ఆర్బ్‌ను కనుగొనడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని మానవ రూపం కారణంగా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి.
Read Also : 800 ఏళ్లుగా ప్రాణాలతో… చావనివ్వని శాపం… గ్రిప్పింగ్ స్టోరీ, అదిరిపోయే ఫాంటసీ థ్రిల్లర్