E-Paper
Advertisement

వైభ‌వ్ త‌ల‌రాత మార్చిన జింబాబ్వే..ర్యాంకింగ్స్ లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

వైభ‌వ్ త‌ల‌రాత మార్చిన జింబాబ్వే..ర్యాంకింగ్స్ లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్
Advertisement

ICC Rankings Vaibhav Sooryavanshi: టీమిండియా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ( ICC Rankings) తాజాగా ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్ లో మనోడు 230 స్థానాలు ఎగబాకాడు. జింబాబ్వే తో జరిగిన టి20 సిరీస్ కంటే ముందు 278వ ర్యాంకులో వైభవ్ కొనసాగాడు. అయితే, ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ… 230 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంకు సాధించాడు. దీంతో సోషల్ మీడియాలో వైభవ్ సూర్య వంశీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అతి త్వరలోనే టాప్ 5లోకి కూడా వస్తాడని వెల్లడిస్తున్నారు.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

వైభ‌వ్ త‌ల‌రాత మార్చిన జింబాబ్వే..230 స్థానాలు ఎగబాకిన వైభవ్

Advertisement

టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( IND VS ZIM) మధ్య మొన్నటి వరకు టి20 సిరీస్ ( T20 series) జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడు టి20 లో సిరీస్ లో టీమిండియా అద్భుతంగా రానించి.. జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ టోర్నమెంట్లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ… ఓపెనర్ గా బరిలోకి దిగాడు. మొదటి మ్యాచ్ లోనే 18 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతిపిన్న వయసులో టి20 లలో అర్థ సెంచరీ నమోదు చేసిన తొలి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు.

సచిన్ టెండూల్కర్ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ఇక మూడవ టి20లో 81 పరుగులు చేసి తన సత్తా చాటాడు. సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ…. మ్యాచ్ మాత్రం గెలిపించాడు. ఇలా మూడు టి20 లో అద్భుతంగా రాణించినందుకు… ఐసీసీ ర్యాంకింగ్స్ లో (ICC Rankings ) మెరుగైన స్థానాన్ని దక్కించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్ కంటే ముందు 278వ స్థానంలో  ఉన్న వైభవ్.. 230 స్థానాలు ఎగబాకి, 48వ స్థానాన్ని దక్కించుకున్నాడు. వైభవ్ సూర్య వంశీ మరో నాలుగు మ్యాచ్ లో ఇలాగే ఆడితే, టాప్ 5 కాదు, నెంబర్ వన్ ఆటగాడిగా నిలుస్తాడు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు.

వైభ‌వ్ అగ్ర స్థానానికి చేరే ఛాన్స్..ఇదిగో ఫ్రూఫ్‌

Advertisement

టీమిండియా ఏడాది చివరి వరకు మొత్తం 13 టీ20లు ఆడనుంది. వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( West Indies vs. Team India ) మధ్య అక్టోబర్ ఆరవ తేదీ నుంచి 5 మ్యాచ్ లు జరుగుతాయి. న్యూజిలాండ్ తో అక్టోబర్ 22వ తేదీ నుంచి… ఐదు టి20 లు ఉంటాయి. డిసెంబర్లో శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 3 టీ20 లు జరుగుతాయి. ఈ అన్నింటిలో వైభవ్ ఆడతాడు. ఈ నేపథ్యంలో అన్ని మ్యాచ్ లలో అద్భుతంగా రానిస్తే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ఆటగాడిగా నిలవడం గ్యారెంటీ అంటున్నారు. మ‌రి ఈ అవ‌కాశాన్ని వైభ‌వ్ ఎలా వినియోగించాడో ? చూడాల్సిందే.

 

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

 

 

Related News

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

Big Stories

Advertisement
×