E-Paper
Advertisement

తక్కువ ఖర్చు.. ఎక్కువ సేఫ్టీ.. మీ కారులో ఈ 6 గ్యాడ్జెట్లు ఉన్నాయా?

తక్కువ ఖర్చు.. ఎక్కువ సేఫ్టీ.. మీ కారులో ఈ 6 గ్యాడ్జెట్లు ఉన్నాయా?
Advertisement

Car Gadgets: వర్షాకాలంలో కారు డ్రైవింగ్ చేయడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. భారీ వర్షం, తడిచిన రోడ్లు, అద్దాలపై పడే నీటి బిందువులు డ్రైవర్ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ ను సులభతరం చేసే ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో రూ.500 లోపే లభించే అత్యుత్తమ స్మార్ట్ గ్యాడ్జెస్ట్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి వల్ల డ్రైవింగ్ లో కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పోర్ట్రానిక్స్ క్లాంప్ M3 ఫోన్ హోల్డర్

వర్షంలో నావిగేషన్ చూడటం ఎంతో సవాలుతో కూడుకున్న పని. ఫోన్ చేతిలో పట్టుకుని డ్రైవ్ చేయడం చాలా ప్రమాదకరం. ఈ సమస్యకు ‘పోర్ట్రానిక్స్ క్లాంప్ M3 ఫోన్ హోల్డర్’ చెక్ పెడుతుంది. డాష్‌బోర్డ్ లేదా ఏసీ వెంట్ వద్ద ఫోన్‌ను ఇది స్ట్రాంగ్ కు పట్టి ఉంచుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి మల్లకుండా మ్యాప్స్ చూసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

పోర్ట్రానిక్స్ 80W కార్ ఛార్జర్

Advertisement

వర్షాకాలంలో లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నప్పుడు ఫోన్ బ్యాటరీ డౌన్ అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే. కాబట్టి పోర్ట్రానిక్స్ 80W ఫాస్ట్ కార్ ఛార్జర్ ను కొనుగోలు చేస్తే.. ప్రయాణంలోనే మీ స్మార్ట్‌ఫోన్, ఇతర డివైజ్‌లను చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అత్యవసర సమయంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

రోబస్ట్ ఎమర్జెన్సీ సేఫ్టీ హామర్

వర్షాకాలంలో కార్ డోర్ల మధ్య నీరు చేరి.. ఒక్కోసారి అవి లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తూ కార్ డోర్లు లాక్ అయితే బయటపడటానికి ఈ లైఫ్ సేవింగ్ టూల్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా విండో గ్లాస్‌ను సులభంగా పగలగొట్టవచ్చు. అలాగే సీట్ బెల్ట్ కట్టర్‌గా కూడా ఇది పనిచేస్తుంది.

డిటాచి డిజిటల్ టైర్ ప్రెజర్ గేజ్

Advertisement

తడి రోడ్లపై టైర్లకు గ్రిప్ చాలా అవసరం. టైర్లలో గాలి సరైన ప్రమాణంలో ఉందో లేదో తెలుసుకోవడానికి డిటాచి డిజిటల్ టైర్ ప్రెజర్ గేజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది డిజిటల్ స్క్రీన్‌పై ఖచ్చితమైన ప్రెజర్ చూపిస్తుంది. తద్వారా సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

HSR రియర్ వ్యూ మిర్రర్ యాంటీ-ఫాగ్ ఫిలిం

వర్షం పడుతున్నప్పుడు సైడ్ మిర్రర్లపై నీటి చుక్కలు నిలిచిపోయి వెనుక వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించవు. ఈ నేపథ్యంలో HSR యాంటీ-ఫాగ్ ఫిలింను సైడ్ మిర్రర్లకు అతికిస్తే.. వర్షపు నీరు అద్దంపై నిలవకుండా జారిపోతుంది. దీనివల్ల వ్యూ చాలా క్లియర్‌గా ఉంటుంది.

Also Read: 8 కేజీల వాషింగ్ మిషన్‌లే ఎందుకు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి? కారణాలివే!

రీఛార్జబుల్ పోర్టబుల్ ఎమర్జెన్సీ లైట్

వర్షాకాలంలో కార్లు తరుచూ రిపేర్లు వస్తుంటాయి. ఒకవేళ రాత్రి వేళ కారు రిపేర్ వచ్చి.. చీకటి ప్రదేశంలో ఆపాల్సి వస్తే ఈ రీఛార్జబుల్ ఎమర్జెన్సీ లైట్.. ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మంచి లైటింగ్ ఇవ్వడంతో పాటు పోర్టబుల్‌గా తీసుకెళ్లడానికి ఎంతో ఈజీగా ఉంటుంది.

Also Read: ఒకే ఏడాదిలో పలుమార్లు ఉద్యోగాలు మారారా? ఐటిఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

Related News

ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

రైలు వాష్ రూమ్ లో యువతి, యువకుడు.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

రైలులో ప్రమాదవశాత్తు కిందపడినా ఇక పరిహారం.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

QR కోడ్ స్కాన్ చేస్తే సెకన్లలో పేమెంట్.. భారత UPI చూసి జర్మన్ మంత్రి ఆశ్చర్యం!

కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

రైలు టికెట్ల కోసం పోటెత్తిన జనం.. IRCTC కొత్త రికార్డు!

కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ వందేభారత్‌ సహా 9 రైళ్లు రీషెడ్యూల్!

Big Stories

Advertisement
×